KDP: వేంపల్లి మండలం నందిపల్లిలో వెలసిన శ్రీ నందీశ్వరాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నంద్యాల మురళి శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. తాడిపత్రి మాజీ ఏమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు శ్రీకాంతరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.