PLD: వినుకొండ పార్టీ కార్యాలయం వద్ద శనివారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని స్వయంగా ట్రై సైకిళ్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ట్రై సైకిళ్ల పంపిణీ ద్వారా దివ్యాంగులు తమ దైనందిన పనులను సులభంగా పూర్తి చేసుకుని, స్వయంసమృద్ధి సాధించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.