SS: రొద్దంలోని న్యూ ఎస్సీ కాలనీలో మంత్రి సవిత ఆదేశాల మేరకు శనివారం వీధి లైట్లు ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన నీటి ట్యాంకు వద్ద రాత్రివేళల్లో చీకటి ఉండటంతో కాలనీవాసుల అభ్యర్థన మేరకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. మంత్రికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెన్నకేశవులు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.