W.G: హర్యానాలో జరిగిన 5వ ఖేల్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్లో భీమవరం జిల్లాకు చెందిన యాతం నాగబాబు సత్తా చాటారు. 400, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి రెండు స్వర్ణ పతకాలు, 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు. ప్రస్తుతం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉప మలేరియా అధికారిగా పనిచేస్తున్నారు.