సోషల్ మీడియా ప్రభలిన తరువాత వింత వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. అందులో భాగంగా ఓ అందమైన అమ్మాయి సోప్ తింటుంది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు.. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది..
Woman EATS SOAP In Viral Video, Leaves Netizens Shocked
Viral News: ఓ మహిళ సబ్బు తింటున్న వీడియో ఇన్స్టాగ్రామ్(Instagram)లో దర్శనం ఇచ్చింది. ఆమె సబ్బును బయటకు తీయడం, వాసన చూసి నోటితో కొరికి చూపించింది. నిజానికి ఈ వీడియో చూస్తుంటే అదేంటి సబ్బును కేకులా తింటుంది అనిపిస్తుంది. కొంతమందికి అయితే అది చూస్తుంటే కడుపులో తిప్పిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం రోజు స్నానం చేసే సబ్బు(soap) ఒక్కసారిగా మన కళ్ల ముందు కనిపించిన అనుభూతి కలుగుతుంది. అయితే అసలు విషయం వేరే ఉంది.
ఇన్స్టాగ్రామ్ రీల్‌కి ఐ లవ్ ఈటింగ్ సోప్(I Love Eating Soap) అని క్యాప్షన్ ఇచ్చి ఒక సబ్బు కేకు తిన్నట్లు తినేసింది అనుకుంటున్నారా? నిజానికి అది కేకే. ఆమె సబ్బు తినడం చూసి నెటిజన్లు ముందు వింతగా చూసినా దాని వెనుక ఉన్న నిజం తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ వీడియోను కోల్‌కతాకు చెందిన సుచి దత్తా అనే బేకర్ పోస్ట్ చేశారు. తాను కేక్స్ తో ఇలాంటి ప్రయోగాలు చేయడంలో దిట్టా అని చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక్కసారి చూస్తే మీకే అర్థం అవుతుంది. దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్లతో తమ ఫీలింగ్‌ను పంచుకున్నారు. కొందరు యాక్.. నిజమైన సోప్ అనుకొని భయపడ్డా అని, మరికొందరూ బాగుంది అని కామెంట్లు చేశారు.