సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి(Nobel Prize) నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేను వరించింది. జాన్ ఫోసే సాహిత్య రంగంలో ఎంతో కృషి చేశారు. ఆయన వినూత్న నాటకాలు రాశారు. ఆయన పద్యాలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయి. స్వరం వినిపించలేని వారి కోసం ఆయన సాహిత్యం పనికి వచ్చినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది. ఫోసే తన కథనాల్లో మానవ స్థితిగతుల్నే ముఖ్య థీమ్‌గా తీసుకుంటూ ఉంటారు.
This year’s literature laureate Jon Fosse writes novels heavily pared down to a style that has come to be known as ‘Fosse minimalism’.
This can be seen in his second novel ‘Stengd gitar’ (1985), when Fosse presents us with a harrowing variation on one of his major themes, the… pic.twitter.com/5v1fQ6C6CJ
నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో జాన్ ఫోసే 1959లో జన్మించారు. నార్వేయన్ నినార్క్ శైలిలో ఆయన రచనలు ఉండటం విశేషం. ఆయన రచనల్లో నాటకాలు, నవలలు, కవిత్వాలు, వ్యాసాలు, చిన్నపిల్లల పుస్తకాలు, తర్జుమాలు వంటివి ఉన్నాయి. మనుషుల జీవితంలో జరిగే యధార్థ సంఘటనల ఆధారంగా ఆయన చాలా రచనలు చేశారు. ఆ రచనలే ఎందరికో ఓదార్పుగా మారాయని నోబెల్ కమిటీ వెల్లడించింది.
BREAKING NEWS The 2023 #NobelPrize in Literature is awarded to the Norwegian author Jon Fosse “for his innovative plays and prose which give voice to the unsayable.” pic.twitter.com/dhJgGUawMl