Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును (Chandrababu) బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సమయం దొరికితే చాలు.. చంద్రబాబు గురించి ప్రశ్నలు వేస్తుంటారు. ఇప్పుడు జైలులో చంద్రబాబు ఏం చేస్తున్నారని మరోసారి అడిగారు. ఎక్స్‌లో ట్వీట్ చేయగా.. నెటిజన్లు కూడా అదేవిధంగా స్పందిస్తున్నారు.
స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబు గత 25 రోజుల నుంచి జైలులో ఉన్నారు. అరెస్ట్ చేయగా.. తొలుత 14 రోజుల రిమాండ్.. ఆ తర్వాత రెండు రోజులు పెంచారు. తర్వాత మరో 11 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించారు. ఈ రోజు కూడా చంద్రబాబు తరఫు లాయర్- సీఐడీ తరఫు లాయర్ వాదనలు కొనసాగాయి. జైలులో ఏం చేస్తున్నారని వర్మ అడగగా.. చాట్ జీపీటీతో సృష్టిలేని ఇమెజిన్ చేసి పనిలో ఉన్నారని ఒకరు.. చాట్ జీపీటీ అంటే చంద్రబాబు గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ టూల్ అని ఒకరు రాశారు.
ఇలా ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. జైలు నుంచి బయటకు ఎలా రావాలాని ఆలోచిస్తున్నారని మరొకరు రియాక్ట్ అయ్యారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. విచారణకు మేజిస్ట్రేట్ రేపటికి వాయిదా వేశారు.