WGL: జిల్లాలోని ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీలోపు అర్హత కలిగిన షెడ్యూల్ కులాల యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని ఈడీ కోరారు.