BHNG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ శాసన సభ విప్‌గా నియామకం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ గడుసు శశిదర్ రెడ్డి ఆయన్ను కలిసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. నకిరేకల్ అభివృద్ధికై అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.