ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల కోతపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక విధమైన భయాందోళన వాతావరణం కమ్ముకుంది. దీంతో దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విటర్, షేర్ చాట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించగా.. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులను సాగనంపింది. దాదాపు 400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ స్విగ్గీ నిర్ణయం తీసుకుంది.
సంస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష తెలిపారు. ప్రతిభ గల 380 మందిని తొలగిస్తున్నాం. పరి పరి విధాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు శ్రీహర్ష ప్రకటించాడు. తొలగించిన ఉద్యోగులకు 3 నుంచి 6 నెలల వేతనం స్విగ్గీ అందించనుంది. ఈ మేరకు తొలగించిన ఉద్యోగులకు సంస్థ ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది.