JG: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ దర్శించుకున్నారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ తోపాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి అంజనేయ స్వామిని దర్శించుకున్నారు . కేంద్ర మంత్రి రాకను పురస్కరించుకుని మేళతాళాలతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు.