ఎట్టకేలకు డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్‌కు రంగం సిద్దం అవుతోంది. ట్రైలర్ రిలీజ్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఇదే విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆ రోజు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.
Salaar trailer: ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్.. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. సలార్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం.. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు హిట్ లేకపోవడంతో.. సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఓ రేంజ్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో డార్లింగ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
సలార్ ట్రైలర్ వస్తే అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోతాయి. ఇప్పటి వరకు సలార్ నుంచి జస్ట్ ఒక్క టీజర్ మాత్రమే బయటికొచ్చింది. అందుకే సలార్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. సలార్ నుంచి ఒకటి కాదు రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ట్రైలర్‌ని అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి లెక్కెస్తే సలార్ రిలీజ్‌కు రెండు నెలల సమయం ఉంది. కాబట్టి.. సెకండ్ ట్రైలర్‌ని సినిమా రిలీజ్ సమయంలో విడుదల చేయబోతున్నారు. ఈ రెండు ట్రైలర్స్‌తో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ లెక్కలు సెట్ చేసేస్తాడని అంటున్నారు. ప్రభాస్ ఊచకోతకు డిజిటల్ రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు కానున్నాయి. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.