SKLM: ప్రతిరోజు వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న పవర్ హౌస్ జిమ్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని కేక్ కటింగ్ చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు.