ATP: ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో బారికేడ్లు పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ జగదీష్ అభిప్రాయపడ్డారు. అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రి యాజమాన్యం సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జిల్లా పోలీసుశాఖకు 100 బారికేడ్లు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో వీటిని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.