Ram Charan visits Siddhivinayak Temple to seek blessings of Lord Ganesha
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అల్లు సీతారామ రాజు పాత్రలో ఒదిగిపోయాడు. నటనకు నార్త్ జనాలు కూడా ఫిదా అయిపోయారు. మూవీలో ఓ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత, ఆయన నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.
శంకర్ దర్వకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఆయన గాయం బారిన పడ్డాడనని, ఈ క్రమంలో షూటింగ్ గాయపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ముంబయిలో రామ్ చరణ్ తేజ కనిపించారు. నగరంలో సిద్ధివినాయకుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. రామ్ చరణ్ దర్శనానికి రావడంతో సిద్ది వినాయక టెంపుల్‌కు అభిమనులు గుంపులు గుంపులుగా తరలి వచ్చారు. స్టార్ హీరో, రామ్ చరణ్… బుధవారం గణేశుడికి ప్రార్థనలు చేసి.. తన 41 రోజుల అయ్యప్ప దీక్షను ముగించడానికి ఆలయాన్ని సందర్శించారు. నలుపు రంగు దుస్తులను ధరించి, అతని బృందంతో కలిసి కనిపించాడు. చరణ్ బయట ఎవర్నీ పట్టించుకోకుండా ఆలయంలోకి ప్రవేశించాడు. చాలా మంది అభిమానులు చరణ్‌ను కలిసేందుకు.. అతనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.