»Indian Cricket Captain Rohit Sharma Deleted Twitter And Instagram Apps From His Phone
Rohit Sharma: నా ఫోన్లో ఆ రెండు యాప్స్‌ను తొలగించా
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత క్రమశిక్షణతో జట్టును నడిపిస్తున్నాడో తెలపడానికి ఈ ఉదాహారణ చాలు అనిపిస్తుంది. గత 9 నెలలుగా అతడి ఫోన్లో ఆ రెండు పాపులర్ యాప్స్ లేవట. ఏదైనా పోస్ట్ చేయాలన్నా అది తన వైఫ్ చూసుకుంటుందని పేర్కొన్నారు.
Indian cricket captain Rohit Sharma deleted Twitter and Instagram apps from his phone
Rohit Sharma: మొబైల్ అంటే ఇంటర్నెట్(Internet), ఎంటర్టైన్మెంట్(Entertainment), ఎంత పనిలో ఉన్నా సరదాగా రీల్స్ చూడడం ఓ అలవాటు. ఇక సెలబ్రెటీలు అయితే అలా టైమ్ పాస్‌గా పోస్టులు చేసినా అది కమర్షల్‌గా కన్వర్ట్ అవుతుంది. అలాంటిది భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) గత 9 నెలలుగా తన ఫోన్లో మోస్ పాపులర్ యాప్స్ అయినా ఎక్స్(X App), ఇన్స్టాగ్రామ్(Instagram)లు లేవని చెప్తున్నాడు. తన ఫోకస్ అంతా కేవలం ఆటపైనే ఉందని పేర్కొన్నారు.
సొంతగడ్డపై రేపటి నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్(World cup) లో భారత్ తలపడబోతుంది. చివరగా 12 ఏళ్ల కిందట స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో ధోనీసేన వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాతి రెండు వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి భారత్ ఎలాగైనా కప్ గెలవాలని కసిగా ఉంది. ఇందుకోసం ఏడాది నుంచే పక్కా ప్రణాళిక రచిస్తుంది. ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ టోర్నీలో జట్టును గెలిపించేందుకు రోహిత్ శర్మ వ్యక్తిగతంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.
ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆటమీద ఫోకస్ ఉండాలని గత తొమ్మిది నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా తెలిపారు. తన ఫోన్లో ఎక్స్, ఇన్‌స్టా యాప్స్‌నే తొలగించినట్టు వెల్లడించాడు. గత 9 నెలలుగా తన ఫోన్లో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లేవని, తాను ఏదైనా వాణిజ్య పోస్ట్ చేయాల్సి ఉంటే ఆ పని తన భార్యే చూసుకుంటోందని పేర్కొన్నారు. వీటిని చూడడం ద్వారా టైమ్, శక్తి రెండు వృథా అని, ఫోన్లో ఉంటే చూడాలనిపిస్తుందనే ఉద్దేశ్యంతో రెండు యాప్‌లను తొలగించినట్లు ఆయన తెలిపారు.