»Shadab Khan Said Hyderabadi Biryani Is The Reason Our Players Are Slowing Down In Fielding
Shadab Khan: మా ఆటగాళ్లు నెమ్మదించడానికి హైదరాబాదీ బిర్యానీనే కారణం!
హైదరాబాద్ బిర్యానీపై పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్(Shadab Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ICC ప్రపంచ కప్ 2023కి ముందు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ, చివరి వార్మప్ గేమ్‌లో మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఓడిపోవడంతో ఈ కామెంట్లు చేశారు.
Shadab Khan said Hyderabadi biryani is the reason our players are slowing down in fielding
హైదరాబాదీ బిర్యానీ ఎక్కువగా తినడం వల్లే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లలో తమ జట్టు సరిగా ఫిల్డింగ్ చేయలేదని పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్(Shadab Khan) చమత్కరించాడు. పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లో తమ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. వారి మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో జరిగింది. అయితే వారి రెండవ మ్యాచ్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 3న జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండు గేమ్‌లలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ క్రమంలో తాము రోజూ హైదరాబాదీ బిర్యానీ(Hyderabadi biryani) తింటున్నాము. అందుకే తాము ఫీల్డ్‌లో కొంచెం నెమ్మదిగా ఉన్నామని షాదాబ్ ఖాన్ వ్యాఖ్యానించారు.
చాలా ఏళ్ల తర్వాత మన దేశానికి వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లకు హైదరాబాద్‌లో అద్భుత ఆతిథ్యం లభిస్తోంది. నగరంలో అగ్ర హోటళ్లలో ఒకటైన పార్క్ హయత్‌లో పాక్ క్రికెటర్లకు బస ఏర్పాటు చేశారు. అక్కడ దాయాది జట్టు ఆటగాళ్లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రపంచంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ పాక్ ఆటగాళ్లకు మరింత పసందైన విందు అనే చెప్పవచ్చు. మంగళవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు షాదాబ్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మ్యాచ్ తర్వాత హోస్ట్ బ్రాడ్కాస్టర్లతో మాట్లాడిన ఖాన్, హైదరాబాదీ బిర్యానీ గురించి అడిగినప్పుడు సరదాగా ఇలా సమాధానమిచ్చాడు. హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వంటకాల్లో ఒకటి. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు తొలిసారి భారత్‌కు వచ్చారు. హైదరాబాద్(hyderabad)లోని విమానాశ్రయంలో వారికి ఘనస్వాగతం లభించింది, ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు తమ సమయాన్ని మరింత ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తోంది.