»16th Gold For India Asian Games 2023 Jyothi Vennam And Ojas Team Win In Archery
Asian games 2023: 16వ గోల్డ్..ఆర్చరీలో జ్యోతి వెన్నమ్ & ఓజాస్ టీం గెలుపు
ఆసియా క్రీడలు 2023లో 11వ రోజు భారత్ పతకాల ఖాతాలోకి మరో స్వర్ణాన్ని చేర్చింది. అర్చరీ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్, ప్రవీణ్ ఓజాస్ సంయుక్తంగా దక్షిణ కొరియాకు చెందిన జట్టను ఓడించి గోల్డ్ గెల్చుకున్నారు.
16th gold for India asian games 2023 Jyothi Vennam and Ojas team win in archery
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని హాంగ్జౌలో ఆసియా క్రీడలు(asian games 2023) 11వరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఉదయం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ కు చెందిన జ్యోతి వెన్నమ్ & ప్రవీణ్ ఓజాస్ డియోటాలే ఫైనల్లో స్వర్ణం కైవసం చేసుకున్నారు. 159-158తో దక్షిణ కొరియా జోడీని ఓడించి అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఈ పోటీలో దక్షిణ కొరియా రజతంతో సరిపెట్టుకుంది.
మరోవైపు ఈరోజు పురుషుల జావెలిన్ త్రో టైటిల్ గెల్చుకునేందుకు భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా సిద్ధంగా ఉన్నాడు. హాంగ్జౌలో ఈ సంవత్సరం తన చివరి ఈవెంట్లో పోటీపడనున్నాడు. భారత జావెలిన్ త్రోయర్ ఈ సీజన్లో అత్యధికంగా ముగించాలని చూస్తున్నాడు. ఆసియా క్రీడలు 2023లో బుధవారం ఉదయం నాటికి భారత్ పతకాల సంఖ్య 71కి చేరుకుంది. పతకాల పట్టికలో భారత్ 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్యాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక చైనా 160 స్వర్ణాలు, 89 రజతాలు, 46 కాంస్యాలతో అగ్రస్థానంలో ఉంది.