»Parul Chowdhary Won Gold For India In Asia Cup 2023 5000m Run
Asia cup 2023: భారత్కు మరో స్వర్ణం.. ఇప్పటివరకు మొత్తం 14
ఆసియా క్రిడాల్లో భారత్ సత్తా చాటుతుంది. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్లో బంగారు పతకం ఇండియాకు దక్కింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు భారత్ 14 పసిడి పతకాలను కైవసం చేసుకుంది.
Parul Chowdhary won gold for India in Asia cup 2023 5000m run
Asia cup 2023: ఆసియా క్రీడల్లో భారత్ తన హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం దక్కింది. 28 ఏళ్ల పారుల్ చౌదరి 15:14:75 నిమిషాల టైమింగ్ తో రేసులో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ కు చెందిన రిరికా హిరోనకా రజతం, కజకిస్థాన్ కు చెందిన కరోలిన్ కిప్కిరూయ్ కాంస్యంతో సరిపెట్టుకున్నారు. ఈ రేసులో దూసుకుపోయిన పారుల్ చౌదరి 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ అంశంలో ఇప్పటికే రజతం సాధించింది. ఇవాళ్టి 5 వేల మీటర్ల రేసులో అద్భుత ప్రదర్శన కనబర్చిన పారుల్ రేసులో ముందు చాలా వరకు వెనుక ఉండిపోయింది. ఆ తరువాత మెరుపు వేగాన్ని పుంజుకుని ఫినిషింగ్ లైన్ వరకు అదే ఊపు కొనసాగించింది. జపాన్ అథ్లెట్ హిరోనకాదే గెలుపు అని అనుకున్న సమయంలో అనూహ్యరీతిలో ఆమెను అధిగమించిన పారుల్ రేసులో విజేతగా నిలిచింది.
ఈ స్వర్ణంతో భారత్ ఖాతాలోని బంగారు పతకాల సంఖ్య 14కి చేరింది. ఓవరాల్ గా 68 పతకాలతో భారత్ ఈ ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య చైనా, జపాన్, దక్షిణ కొరియా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
𝐏𝐚𝐫𝐮𝐥 𝐂𝐡𝐚𝐮𝐝𝐡𝐚𝐫𝐲 𝐰𝐢𝐧𝐬 𝐆𝐎𝐋𝐃 in Women's 5000m at #HangzhouAsianGames with a thrilling last-gasp push 🤯🙌