»Asian Games 2023 October 2 Live Updates Pt Ushas Record Equalled Athletics Medals In Fray
Asian Games 2023:లో పీటీ ఉష రికార్డు సమం చేసిన విత్యా రాంరాజ్
ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగిస్తోంది. విత్యా రాంరాజ్ మహిళల 400 మీటర్ల హర్డిల్ రేసులో 55.42 స్కోరును నమోదు చేసి.. 1984 నాటి దిగ్గజ భారత అథ్లెట్ PT ఉష జాతీయ రికార్డును సమం చేసింది.
Asian Games 2023 October 2 Live Updates PT Usha's Record Equalled Athletics Medals In Fray
ఏషియన్ గేమ్స్ 2023(Asian Games 2023) పోటీల్లో భారత షూటర్లు గురి చేసి కొట్టారు. ఇప్పటిదాకా భారత్ 42 పతకాలు సాధిస్తే, అందులో 22 పతకాలు కేవలం షూటింగ్‌లోనే వచ్చాయి. పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన కైనాన్ చెనయ్, కాంస్య పతకంతో భారత షూటర్ల ప్రస్తానం ఘనంగా ముగిసింది. స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకోవడంతో భారత్ తమ రోజును అద్భుతంగా ప్రారంభించింది. మొదటిది స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలేలో మహిళల జట్టు గెలుపొందగా, పురుషుల స్పీడ్ స్కేటింగ్ 300 మీటర్ల రిలేలో పురుషుల జట్టు రెండవది గెలుచుకుంది.
తర్వాత మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రాంరాజ్(Vithya Ramraj) 55.42 టైమింగ్‌తో పిటి ఉష జాతీయ రికార్డును సమం చేసింది. భారత అథ్లెట్లు సోమవారం (అక్టోబర్ 2) విభాగాల్లో పాల్గొనే అద్భుతమైన రెండు రోజుల తర్వాత జోరును కొనసాగించాలని చూస్తున్నారు. మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ సెమీ-ఫైనల్లో ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ పాల్గొంటారు. విజయం సాధిస్తే చారిత్రాత్మక బంగారు పతకాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఇక బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్లో ఫైనల్ చేరిన భారత(bharat) జట్టుకి బ్యాడ్‌న్యూస్ ఎదురైంది. సెమీ ఫైనల్లో ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్ గెలిచి, భారత్ ఫైనల్ చేరేందుకు కారణమైన హెచ్ఎస్ ప్రణయ్, గాయంతో ఫైనల్ నుంచి దూరమయ్యాడు. చైనాతో పోటీపడే ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ స్థానంలో మిథున్ మంజునాథ్ తలబడబోతున్నాడు.
ఇప్పటిదాకా 11 స్వర్ణాలు, 16 రజతాలు, 15 కాంస్య పతకాలతో 42 పతకాలు సాధించిన భారత్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న ఉజ్బెకిస్థాన్ కూడా 11 స్వర్ణాలతో ఉండడంతో ఒక్క స్వర్ణం సాధిస్తే, టీమిండియా ఐదో స్థానానికి పడిపోవాల్సి వస్తుంది. ఇక చైనా 116 స్వర్ణాలు, 70 రజతాలు, 36 కాంస్య పతకాలతో 222 మెడల్స్‌తో టాప్‌లో ఉంటే సౌత్ కొరియా 118, జపాన్ 106 పతకాలతో టాప్ 3లో ఉన్నాయి.