GNTR: ఫిరంగిపురం ప్రాంతంలో శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్సై శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ చర్యల్లో పత్రాలు లేని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.