»Yendira Ee Panchayathi Movie Team Exclusive Interview With Dev Tompala Bharath Vishika Laxman
Yendira Ee Panchayathi: నడుముపై ముద్దు పెట్టే సీన్ ఉంది.. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా.?
ఏందిరా ఈ పంచాయతీ మూవీ టీమ్ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆక్టోబర్ 6న విడుదల కాబోతుతున్న ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Yendira Ee Panchayathi Movie Team Exclusive Interview With Dev Tompala | Bharath | Vishika Laxman
Yendira Ee Panchayathi: ఏందిరా ఈ పంచాయితీ(Yendira Ee Panchayathi ) చిత్రం పూర్తిగా రాయలసీమ బ్యాగ్‌డ్రాఫ్‌లో జరిగే ఒక విలేజ్ డ్రామా అని హీరో భరత్(Bharath) తెలిపారు. ఇక చిత్రం దర్శకుడు నిర్మాతలు తన ఫ్రెండ్స్ అని అందుకే ఈ సినిమా ఇంత త్వరగా ఫినిష్ అయిందని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ అంతా ఫన్నిగా జరిగిందని, సిరిసిల్లా ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వారు ఎదుర్కొన్నా అనేక విషయాల గురించి ఎంతో ఆసక్తిగా వివరించారు. ఇక వరుసగా ఇదే నెలలో రెండు సినిమాలు, ఇంతకు ముందు నెలలో ఒక సినిమా అలా మొత్తం మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అవడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ విశిక (Vishika) వెల్లడించారు. చిత్రంలో యూత్‌కు కావాల్సిన రోమాంటిక్ సీన్లతో పాటు అన్ని ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇక చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని, అసలు ఏందిరా ఈ పంచాయితో సినిమాను థియేటర్లోనే ఎందుకు చూడాలో హీరో భరత్ చక్కగా వివరించారు. మరి ఈ చిత్ర యూనిట్ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం చెప్పిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూసేయండి.