Naryana & Co Telugu Movie: తెలుగులో క్లీన్ కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అప్పట్లో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు తెరకెక్కించే లాంటి సినిమాలను ఈ మధ్యకాలంలో యువ దర్శకులు సైతం రూపోందించడం విశేషం. ఈ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ చిన్న పాపిశెట్టి తెరకెక్కించిన నారాయణ అండ్ కో ఆ కోవాలోకి చెందిన మూవీ. థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీ ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందుతుంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్ ఆఫ్ నారాయణ అండ్ కో ఫ్యామిలీ లీడర్ నారాయణ (దేవి ప్రసాద్) ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ని తీసుకొని ఇంట్లోకి వచ్చే సీన్ తో సినిమా మొదలవుతుంది. అదారబాదరగా అలా బెడ్ రూమ్ లోకి వెళ్లి గుట్టు చప్పుడు కాకుండా బ్యాగ్ ను తన తలగడ కింద పెట్టుకొని నిద్రపోతాడు. అదే సమయంలో ఆ బ్యాగును దొంగలించడానికి ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడతారు. వాళ్లకి తోడు మరో ఇద్దరు లేడీస్ కూడా దొంగతనానికి వస్తారు. అలా నలుగురు కలిసి నారాయణ తలగడ కింద ఉన్న బ్యాగును దొంగలించడానికి నానా తిప్పలు పడతారు. కట్ చేస్తే వాళ్లంతా ఒకే ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లోనే వాళ్లు దొంగతనం చేస్తున్నారు. మరి ఆ నలుగురెవరు నారాయణ ఫ్యామిలీ కథేంటో పాత్రల ఇంట్రడక్షన్ మొదలు అవుతుంది.
చదవండి:Pakistani actor: రెండో పెళ్లి చేసుకున్న షారూక్ హీరోయిన్..!
ఇంటి పెద్ద పీకే నారాయణ (దేవి ప్రసాద్) జీవితంలో ఏం పీకలేక మీ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు గత 30 సంవత్సరాలుగా. నీతి నిజాయితీకి పర్యాయపదంలా ఉంటాడు. జానకి నారాయణ (ఆమని) ఓ మధ్యతరగతి ఇల్లాలు. పంచాంగం అంటే పిచ్చి. అది చూడనిదే గంటైనా తిప్పదు, గంట అయినా కొట్టదు అన్నట్లు ఆమె వ్యవహార శైలి ఉంటుంది. ఇక నెక్స్ట్ మన హీరో ఆనంద్ నారాయణ (సుధాకర్ కోమకుల) బెట్టింగ్‌లు పెట్టడం వ్యసనం. డబ్బులు పోగొట్టుకోవడం ఆనవాయితీలా ఉంటుంది. ఇక ఆనంద్ బాధ భరించలేక నారాయణ ఒక కారు కొనిపెట్టి, క్యాబ్ డ్రైవర్ గా పని చేసుకోమని చెప్తాడు. దాంతో ఆనంద్ క్యాబ్ డ్రైవర్ గా మారుతాడు.
సుభాష్ నారాయణ, నారాయణ చిన్న కొడుకు అలియాస్ సుబ్బు ఫోటోగ్రాఫర్ అవ్వాలన్నది అతని గోల్. ఎందుకంటే ఎప్పుడు అమ్మాయిలు చుట్టూ ఉండొచ్చు, అమ్మాయిలను బీట్ వేయొచ్చు అనేది వాడి ఇంటర్నల్ థాట్. అప్పుడప్పుడు బైనాక్యులర్ తో పక్కింట్లో ఆంటీ సుగుణను చూస్తూ చొంగ కార్చుకుంటూ శునక ఆనందం పొందుతుంటాడు. ఇక ఈ గ్యాంగ్ లో చివరిది నళిని (పూజా కిరణ్) నారాయణకు మేనకోడలు. ఇలా క్యారెక్టర్లన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా అప్పుడెప్పుడో జంధ్యాల సినిమాల్లో చూసినంత ముచ్చటగా పరిచయం అవుతాయి.
ఇలా సాగుతుండగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అర్జున్(అలి రెజ) ఒక కేసు ఫైల్ ని స్టడీ చేస్తుంటాడు. అది శంకర్ ఫైల్, రాజకీయాల్లోకి రావాలనేది ఆయన ఆశయం. అడుక్కునే స్థాయి నుంచి ఇల్లీగల్ దందాలు చేసే వరకు అనేక కార్యాకలాపాల్లో శంకర్ (తోటపల్లి మధు) సిద్ధహస్తుడు. ఒక మీడియా ఛానల్ ఇస్తున్న ఇంటర్వ్యూలో అతని ఇంట్రడక్షన్ కామెడీగానే ఉంటుంది.
నెక్స్ట్ సీన్లో హీరో తన ఫ్రెండ్స్ తో ఒక పార్టీలో పాల్గొంటాడు. ఈ పార్టీలో పాల్గొన్న హీరో ఫ్రెండ్ ఒకతను.. మీసం వచ్చిందని పార్టీ ఇస్తున్నాడు అంటే అది మీసం కాదురా వీసా అని హీరో అంటాడు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు హీరో, అతని ఫ్రెండ్స్ ఎలాంటి బ్యాచో.
ఇదే పార్టీలో ప్రీతి (ఆరతి పొడి)ని ఆనంద్ డాన్స్ చేస్తూ తనకు డాష్ ఇస్తాడు. ఈ సీన్ ఇక్కడ చాలా క్యాజువల్ గా చూపించినా.. కథలో ఇది ఓ టర్నింగ్ పాయింట్ లాంటిదే అని చెప్పొచ్చు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆనంద్ క్యాబ్ లో ప్రీతి ఎక్కుతుంది. ఆనంద్ ఎవరో తెలియనట్టు నటిస్తోంది. ఆనందుకు మాత్రం తను ఎక్కడో చూసాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్యలో మామిడికాయల మోహన్ (సప్తగిరి) ఎంటర్ అయి వారిని తన తింగరితనంతో కన్ఫ్యూజ్ చేస్తాడు. అయితే రాత్రి జరిగిన ఒక సీన్ కి అక్కడ సింక్ అయ్యేలా కామిడీని పండిస్తాడు సప్తగిరి. అంతలో ఆనంద్ కి పార్టీలో అమ్మాయిని చూసినట్టు గుర్తుకు రావడంతో అమ్మాయి కారు దిగి కోపంతో వెళ్లిపోతుంది.
నెక్స్ట్ సీన్లు హీరో తమ్ముడు సుబ్బు పక్కింట్లో ఆంటీని బైనాక్యులర్ తో చూస్తూ దొరికిపోతాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి అతను పడేతిప్పలా మామూలుగా ఉండదు.
హీరో మరదల్ నళిని ఒక రింగులు దొంగతనం చేసి ఆనందుకు దొరికిపోతుంది. అయితే తనలా ఎందుకు దొంగతనం చేస్తుందో అనేది తన స్టైల్ లో ఒక ఫిలాసఫీ చెప్తుంది. అదే టైంలో ఆనంద్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది చూసి భయపడడం నాలిని చూస్తుంది. అసలు విషయం ఏంటని అడిగితే.. హీరోకు పది లక్షల అప్పు ఉంది అన్న విషయం బయటపడుతుంది. దానికి నలిని ఒక ప్లాన్ చెప్తా అంటే హీరో వద్దంటాడు.
ఇక సినిమాలో మెయిన్ ప్లాట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది పొలిటిషన్ శంకర్ తాను లీడర్ కావాలంటే ఒక నాయకుడికి దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన పిల్లి బొమ్మను ఇవ్వాలని కండిషన్ పెడతాడు. దీన్ని తీసుకురావడానికి సూర్య (శివకుమార్) ను రంగంలోకి దింపాలని శంకర్ ప్లాన్ వేస్తాడు.
నెక్ట్స్ సీన్ లో సుబ్బు ఒక శవాన్ని ఫోటోలు తీసే ప్రాసెస్‌లో ఒక అమ్మాయికి కనెక్ట్ అవుతాడు అది చాలా కామెడీగా ఉంటుంది. మీరే ఊహించుకోండి శవం, అమ్మాయి, లవ్ ఈ కాంబినేషన్ ఎంత క్రిస్పీగా ఉంటుందో.
ఇకసారి ప్రీతి ఆనంద్ కి కాల్ చేసి ఒక రెస్టారెంట్ కి రమ్మంటుంది. క్యాబ్ డ్రైవర్ అయినా ఆనంద్ పికప్ తో పాటు లంచ్ కూడా ఫ్రీ అని ఎగేసుకొని వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లాక తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది. ఇతనికి ఏమీ అర్థం కాదు. దాంతో కంగ్రాజులేషన్స్ అని, గుడ్ న్యూస్ అని ఏదేదో అతను వర్షన్ లో అతను ఉండగా ఈ ప్రెగ్నెంట్ కు కారణం తనే అనే విషయాన్ని ఆనందుకు చెబుతుంది. దాంతో ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రీతి అడుగుతుంది. ఆనంద్ కి ఇష్టం లేకపోయినా.. తాను దాచుకున్న పది లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కోసం ప్రీతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే నారాయణ డోర్ తీస్తే ఇద్దరు పెళ్లి దండలతో ఇంటి ముందట నిలబడి ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని చూస్తుండడంతో నారాయణ ఫ్రస్టేషన్ ఆపుకుంటూ.. చేతులు పిసుకుంటూ ఉండగా జానకి ఆనంద్ వాళ్ల అమ్మ వీళ్లను చూసి ఒక డైలాగ్ అంటుంది.. కనీసం నీ పెళ్లికైనా ఒక పట్టు చీర కొందామనుకున్నా.. ఆ అదృష్టం లేకుండా చేసావు కదా రా అంటుంది. అంతే కట్ చేస్తే శోభనం.. మొదటి రోజు రాత్రి ప్రీతి అసలు నిజం చెబుతూ తన అసలు ప్రెగ్నెంటే కాదన్న విషయం చెబుతుంది. ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆనంద్ ని ఇలా మాయ చేసి పెళ్లి చేసుకున్నట్టు చెప్పడంతో ఆనంద్ లైట్ గా హర్ట్ అవుతాడు.
తరువాతి సీన్లో సుబ్బు స్టూడియోకి సోనా అదే శవం దగ్గరపరచమైన అమ్మాయి వస్తుంది. వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు.
ఈ లోపు సూర్యకు శంకర్ ఫోన్ చేసి పిల్లి బొమ్మను తీసుకురావాలని ఒత్తిడి చేస్తాడు.
నెక్ సీన్లో సుబ్బు సోనా ఇంటిమేట్ అయిన సీను బ్లాక్మెయిల్ చేస్తూ ఒకరు 10 లక్షలు సుబ్బును అడగడంతో సుబ్బుకి ఏం చేయాలో తెలియదు. అదే సమయంలో హీరో బార్లో బెట్టింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి తనకు అప్పిచ్చిన అతను వచ్చి బెదిరించి కారు లాక్కుంటాడు.
సుబ్బుకు ఒక వారం రోజుల్లో గా మనీ అరేంజ్ చేయాలని వార్నింగ్ వస్తుంది. నెక్స్ట్ సీన్ లో సుబ్బు, ఆనంద్ ఇద్దరు 10లక్షల గురించి మాట్లాడుకుని వారికి డబ్బు అవసరం అన్న విషయాన్ని నాన్నని అడుగుదామని.. ఉదయం నారాయణను డబ్బులు అడుగుతారు. ఇంట్లో కోడలు ముందు పరువు పోకూడదని తాను తిట్టలేక, ఏమనలేక ఫ్రస్టేషన్‌తో ఉంటాడు. అందరూ డబ్బు గురించి చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటారు. డబ్బు విషయంలో కేర్ లెస్ గా ఉన్న కొడుకులను తిడుతూ.. 30 ఏళ్ల తన సర్వీసులో ఒక్క రూపాయి కూడా తేడా లేదు. నీతికి, నిజాయితీకి పేరు నారాయణ అంటూ ఓ డైలాగ్ చెప్తాడు కట్ చేస్తే బ్యాంకులో పాతిక లక్షలు తేడా వచ్చిందని నారాయణను ఉద్యోగం నుంచి తీసేస్తూ.. వారం రోజుల్లోగా పాతిక లక్షలు కట్టాలని మేనేజర్ బయటకు పంపించేస్తాడు. సో ఇక్కడ ఫ్యామిలీ మొత్తానికి డబ్బు అనేది అవసరం. మరి దాన్ని ఎలా సంపాదిస్తారు అనేది ఈ కథలో కీలకం.
ఇంటికొచ్చి ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు కడదాం అనుకుంటే.. జానకి బంగారాన్ని అమ్మేసి చీరల షాపుకు సంబంధించిన వ్యవహారంలో మోసపోతుంది. దాంతో కుటుంబం అంతా ఒకచోట కూర్చుని విచారిస్తుండగా.. నారాయణ ఒక డైలాగ్ అంటాడు. కష్టాలు క్రెడిట్ కార్డు లాంటివి అవసరం లేకున్నా అందుబాటులో ఉంటాయి. సొల్యూషన్లు సాలరీ లాంటివి అందాయి అనుకునే లోపే ఆవిరి అయిపోతాయి. ఈ డైలాగ్ వాళ్ళ సిచువేషన్ లో కామెడీ పండించడానికి బాగా పనికొచ్చింది అలాగే బ్యాంకు ఉద్యోగం పోయిందన్న విషయాన్ని ఫ్యామిలీకి చెప్పి కోడల నుంచి దాచాలి అనుకుంటారు. ఇక్కడితో కథలో మలుపు స్టార్ట్ అవుతుంది. వారి కష్టాల నుంచి బయటపడడానికి నలిని సాయం అడుగుతారు. దానికి తాను ఒక మర్డర్ ప్లాన్ చెప్తుంది. దానికి నారాయణ స్పృహ తప్పి పడిపోతాడు.
అయితే అసలు ప్లాన్ కిడ్నాప్ అని చెప్పడంతో.. నీతిగా నిజాయితీగా బతికిన తాను ఆ పని చేయలేనని నారాయణ అనడంతో.. జానకి నేను చేస్తా అంటుంది. పైగా కృష్ణుడు యుద్ధం చేయకపోతే సత్యభామ చేయలేదా అనే చక్కటి కవర్ డ్రైవ్ ను విసురుతుంది. ఇక చేసేది లేక నారాయణ కూడా వాళ్లతో చేతులు కలుపుతాడు.
కట్ చేస్తే ఒక ముసలావిడను కిడ్నాప్ చేయాలని అందరూ ప్లాన్ చేస్తారు. కారులో కూర్చుని స్కెచ్ గీస్తుండగా జానకి ఉల్లిపాయలు కట్ చేస్తుంది. తరువాత నువ్వెళ్ళు అంటే నువ్వెళ్ళు అనుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఉండగా ఆమెని ఆ ముసలావిడ దగ్గరికి వెళ్లి కిడ్నాప్ చేసేది మర్చిపోయి, తన చీర గురించి, నగల గురించి ఆరా తీస్తూ తనలో ఉన్న మధ్యతరగతి మహిళను నిద్రలేపుతుంది. అంతలో ముసలావిడ అనుకోకుండా స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఉదయాన్నే లేచి రాత్రి జరిగిన కిడ్నాప్ ఖర్చులను లెక్క రాస్తూ ఉంటాడు నారాయణరావు ఆ సంభాషణలు చాలా కామెడీగా ఉంటాయి నెక్స్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు.
మనీ హైయిస్ట్ గేమ్ లో ఉన్న మాస్కులను వేసుకొని ఇద్దర్ని కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు. వాళ్లు ఎవరో కాదు సుభాష్ దొంగ చాటుగా చూసే సుగుణ ఆంటీ, తన బాయ్ ఫ్రెండ్ అతను ఏసిపి ఇది కూడా ఫెయిల్ అవుతుంది.
శంకర్ సూర్య ప్లాను గురించి అర్జున్ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఇదే తరుణంలో ముంబై నుండి ఆ పిల్లి బొమ్మను తీసుకురావాలంటే ప్రొఫెషనల్ అవసరం లేదని, ఒక ముగ్గురు దేడ్ దిమాక్ గాళ్ళు కావాలనే విషయాన్ని సూర్య శంకర్ తో చెప్తాడు.
తర్వాత సీన్లో నలిని నారాయణ అండ్ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలు వచ్చే ప్లాన్ చెబుతుంది. దానికి అందరూ ఫుల్ ఎక్సైట్ అవుతారు. అది సూర్య బాయ్ తో డీల్ అనగానే నారాయణ భయపడిపోతాడు. దానికి సుబ్బు రిస్క్ లేని లైఫ్, పదములేని నైఫ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే కామెడీ డైలాగ్ తో అందరూ కనెక్ట్ అయ్యి వారి సెటప్, గెటప్, మార్చుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని దేడ్ దిమాక్ బ్యాచ్‌ల మారి సూర్యముందు కూర్చుంటారు. ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ అని కామెడీ పండిస్తారు. ముంబై వెళ్తున్నారు కదా హిందీ మేనేజ్ చేయడం వచ్చా అంటే నాకు వచ్చు అని సుబ్బు అంటాడు. దానికి సూర్య అసిస్టెంట్ అమ్మను ఏమంటారు అని అడిగితే మా, అమ్మమ్మ ను ఏమంటారు అంటే మామా అని సుబ్బు చెప్పడంతో వీళ్ళ గ్యాంగ్ ఎంత దేడ్ దిమాకో సూర్యకు అర్థం అవుతుంది. వారిని ముంబాయికి పంపించే ఏర్పాట్లు చేస్తాడు కట్ చేస్తే స్టోరీ ముంబాయికి షిఫ్ట్ అవుతుంది.
ఇక ముంబాయిలో పిల్లినిచ్చే డాన్ దగ్గర జరిగే సీక్వెన్స్ కడుపు చెక్కలయ్యేలా నవ్వుతాం అంటే అతిశయోక్తి కాదు. ఇక వీళ్ల దగ్గర కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని నారాయణ అండ్ కో పిల్లి బొమ్మని ఇచ్చి పంపిస్తాడు. హైదరాబాద్ కు తిరిగి వచ్చిన నారాయణ అండ్ ఫ్యామిలీ సూర్య కి ఫోన్ చేస్తారు. దానికి రాత్రి 11 గంటలకు పిల్లిని ఇచ్చి డబ్బు తీసుకోమని చెప్పడంతో నారాయణ కుటుంబం అంతా కోటీశ్వరులు అయినట్టు కలగంటూ ఓపాటేసుకుంటారు. పాట అయిపోగానే కోడలు ప్రీతి వస్తుంది. అనుమానంతో వీరిని చూస్తుంది. దాంతో ఆనంద్ ను ఇంట్లోనే ఉంచి సుబ్బు, నారాయణ ఇద్దరు సూర్య కోసం వెళతారు. బొమ్మ కోసం వస్తుండగా పోలీస్ అర్జున్ దారిలో సూర్యను ఆపి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. సూర్య కోసం వెయిట్ చేస్తున్న తండ్రి కొడుకులు చాలా సేపు వెయిట్ చేసి ఇంటికెళ్ళిపోతారు. సూర్య కోసం శంకర్ లాయర్ ని పంపిస్తాడు పిల్లి కోసం ఆలోచిస్తాడు కట్ చేస్తే.
ఉదయం నారాయణ కుటుంబంతో మీటింగ్ పెట్టుకుంటారు. యాజ్ యూజువల్ కామెడీ. సూర్య అరెస్ట్ అయిన విషయం నలిని చెబుతుంది. ఇక చేసేది ఏమి లేక సూర్య రిలీజ్ అయ్యేంతవరకు అన్ని మూసుకొని ఉండాలి అనుకుంటారు. అయితే అంతలోపు పిల్లి బొమ్మను ఎక్కడైనా భద్రంగా దాచి పెట్టాలనుకుంటారు. దానికి కరెక్ట్ అయిన ప్లేస్ హార్మోనియం బాక్స్ అని అక్కడ దాస్తాడు నారాయణ.
పోలీస్ స్టేషన్ సీన్లో అర్జున్, సూర్య ఇద్దరూ ఫ్రెండ్స్ అన్న విషయం రివిల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో సూర్య పోలీస్ అవాలనుకుంటాడు. దానికి ఆఫీసర్స్ లంచం అడుగుతారు. దాంతో సూర్య బాయ్ అవుతాడు.
ఇక మొదటి నుంచి నారాయణకు హార్మోనియం పెట్ట నుదుటికి తగులుతుందని గమనించిన ప్రీతి ఆ పెట్టెను అమ్మేసి వచ్చిన డబ్బులతో వారికి కొత్త బట్టలను తీసుకొస్తుంది. మొదట ఆనందపడిన వారు, హార్మోనియంని అమ్మేయడంతో వచ్చిన డబ్బులని తెలిసి షాక్ అవుతారు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా జాగ్రత్తగా లేకుంటే జాతకాలు మారిపోతాయి జాగ్రత్త అని వార ఫలాల్లో ముందే చెప్పారని జానకి బాధపడుతుంది అంతలో ఇద్దరు అన్నదమ్ములు ఆనంద్, సుబ్బు వస్తారు. జరుగుతున్న విషయం తెలుసుకొని ప్రీతి అమ్మిన షాప్ లోకి వెళ్లి అడిగితే అది అక్కడ ఉండదు. సంగీతం పిచ్చి రాజారావు తీసుకెళ్లాడని షాప్ ఓనర్ చెప్పడంతో ఎలాగైనా దాన్ని సంపాదించాలని మళ్లీ గూడుపుఠాణి పన్నుతారు.
అందరూ కలిసి రాజారాం ఇంట్లోకి చొరబడతారు. వాళ్ళు లోపటికి వెళ్ళగానే డోర్ బెల్ మోగుతుంది. అందరు భయపడిపోతారు. ఎవరని చూస్తే పిజ్జా డెలివరీ అబ్బాయి. వచ్చిన పిజ్జాను అందరూ తింటారు. తరువాత హార్మోనియం పెట్టెను వెతుకుతారు. సోఫాల మధ్యలో, కుర్చీల సందుల్లో వెతుకుతుంటారు. అదే సమయంలో ఈ గ్యాంగ్ తో పాటు మామిడికాయల మోహన్ (సప్తగిరి) యాడ్ అవుతారు. ఇక అందరూ డీల్ కుదుర్చుకొని పెట్టె కోసం జల్లడ పడతారు. కొంత సమయం తర్వాత పెట్ట దొరుకుతుంది. వాళ్ళు వెళ్లిపోతారు.
ఈలోపు శంకర్ కు రాజకీయ నాయకుల నుండి ఫోన్ వస్తుంది.
మరో సీన్లో మామిడికాయల మోహన్ వాటా కోసం నారాయణ ఇంటికి వస్తాడు. ఆ విషయం ప్రీతి చూస్తుంది. ఆ సీక్వెన్స్ అంతా ఫన్నీగా నడిపించిన తర్వాత జానకికి తమ వద్ద ఉన్న వజ్రాలను చూడాలని కోరిక పుడుతుంది. ఇక పిల్లి బొమ్మ కోసం వెళ్లి బీరువా ఓపెన్ చేస్తే అందులో బొమ్మ ఉండదు. మళ్ళీ అందరూ షాక్ అవుతారు. అదే సమయంలో సూర్య బయటకొచ్చి నారాయణకు వాళ్ళ ఫ్యామిలీకి పిల్లి బొమ్మ కోసం ఫోన్లు చేస్తుంటాడు. వీళ్ళ టెన్షన్ తో ఇల్లంతా వెతికి అలసిపోయే టైంలో సూర్య ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. ఇక విషయం తెలుసుకున్న సూర్య వీళ్ళకు రెండు రోజులు టైం ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు.
ఈ విషయాన్ని నలినికి చెప్పాలని ఇంటికి వెళ్తే నళిని అదే సమయంలో డైనింగ్ టేబుల్ పై కూర్చొని డ్రగ్స్ తీసుకోవాలనుకుంటుంది. బెల్ మోగడంతో కంగారులో బెల్లం రసంలో డ్రగ్స్ పడుతాయి. అంతలో ఫ్యామిలీ అంతా భోజనాలకు కూర్చుంటారు. అందరూ బెల్లం రసం తాగి మత్తుగా తూలుతారు. మత్తులో గమ్మత్తుగా చిందేస్తారు ఫ్యామిలీ అంతా సాంగ్ వేసుకుంటారు.
పాట తరువాత నారాయణ ఫ్యామిలి ఇంటికి వస్తారు. పోలీస్ అర్జున్ నారాయణ ఇంట్లో ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. తను ప్రీతి ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేస్తుంది. ఇక సూర్య ఆలోచన వచ్చేసరికి అందరిలో టెన్షన్ వచ్చి ప్రీతికి అసలు విషయం చెప్పేస్తారు. అదే విషయాన్ని ప్రీతి అర్జున్ కి చెబుతుంది. వాళ్ళు చేసిన తప్పుకు అర్జున్ కు కోపం వస్తుంది. తర్వాత కేసును సాల్వ్ చేద్దామంటాడు. ఈజీ మన కోసం వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని బాధపడుతుంటారు ఫ్యామిలీ.
తర్వాత సీన్లో అర్జున్, సూర్య ఇద్దరికి మీటింగ్ జరుగుతుంది. దినంతటికీ కారణం శంకర్ అనే ట్విస్టును బయటపెడతాడు అర్జున్. అంటే నారాయణ ఫ్యామిలీని కూడా చిక్కుల్లో పడేసింది శంకర్ అనేది చెబుతాడు. బ్యాంక్ మేనేజర్ ను మేనేజ్ చేసి, సుబ్బును ట్రాప్ చేసి, ఆనందుని ఇరకటంలో పడేసి శంకర్ జరిపించిన స్క్రీన్ ప్లేను వివరంగా చెప్తాడు. ఇకనైనా మారు అని సూర్యకు ఒక ఛాన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
ఇదే విషయం శంకర్ కు తెలవడంతో నారాయణ ఫ్యామిలీని కిడ్నాప్ చేయమని చెప్తాడు. నారాయణ ఫ్యామిలీ ని కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలు జానకి ఇచ్చిన ప్రసాదాన్ని తిని వాంథింగ్ చేసుకుంటారు.
అదే సమయంలో వాటా కోసం వచ్చిన సప్తగిరి ని కూడా కిడ్నాప్ చేస్తారు గుండాలు. అందరిని ఒక ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తారు. పిల్లి కోసం ఫ్యామిలీని బెదిరిస్తుండగా అంతలో ఆనంద్ ఒక పిల్లి బొమ్మతో ఎంట్రీ ఇస్తాడు. వారికి పిల్లినిచ్చి పారిపోతుండగా.. సుబ్బును మోసం చేసిన సోనా కనిపించడంతో.. సుబ్బు ఆమెను నిలదీస్తాడు.. ఆనంద్ ఎంత రమ్మన్నా సుబ్బు రాడు నమ్మకద్రోహం చేసిందని తనతో వాదిస్తుంటాడు. అంతలో పిల్లి బొమ్మ నకిలీదని శంకర్ కు తెలియడంతో అందరిని మళ్లీ పట్టుకుంటారు.
వారిని బెదిరిస్తుండగా సూర్య, అర్జున్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చి ఓ బీభత్సమైన కామెడీ ఫైట్స్ తర్వాత సూర్యకు గాయమవుతుంది. అందరు అలసిపోతారు. ఆ సమయంలో సుగుణ ఆంటీ లవర్ ఏసిపి వచ్చి శంకర్ ను అరెస్ట్ చేయడంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది. ఫైనల్ గా ఫుల్ కామెడీ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నారాయణ అండ్ కో మూవీ.