Pindam Movie Explained In Telugu Sri Ram Khushi Ravi Avasarala Srinivas Eeswari Rao
Pindam Movie Explained: సుక్లాపేట్ ప్రస్తుతం అనే టైటిల్ పడుతుంది. కారు వస్తుంది. కారులో అన్నమ్మ మంత్రాలు చదువుతుంది. అక్కడికి కుక్క వచ్చి మొరుగుతుంది. కారుకు కుక్క తల కొట్టుకొట్టుంది. బ్లడ్ వస్తుంది. అది గమనించిన అన్నమ్మ మంత్రాలు చదువుతుంది. కుక్క కారుకు దూరంగా పడి చనిపోతుంది. అది చూసి ఇది కుక్కలా లేదు, వెంటనే దీన్ని పూడ్చి పెట్టండి లేదంటే ఊరికే ప్రమాదం అని అన్నమ్మ చెబుతుంది. అదే సమయంలో లోక్ నాథ్ వచ్చి అన్నమ్మను పిలిచి కేసు స్టడీ చేయడానికి వచ్చాను, ప్రొఫెసర్ పంపించాడు అని చెప్తాడు. సరే అంటుంది అన్నమ్మ. ఒక ఇంట్లోకి వెళ్తారు. అక్కడ వాడిపోయిన మొక్కలను గమనిస్తారు. తరువాత ఓ పాప ఉంటుంది. తనతో అన్నమ్మ మాట్లాడుతుంది.
చదవండి:Hanuman: హనుమాన్ డైరెక్టర్, నిర్మాత మధ్య గొడవ?
స్కూల్ కి వెళ్లవా అంటే లేదు అయినా స్కూల్ లో ఏం ఉంటుంది.. బయట ప్రపంచంలోనే చాలా నేర్చుకోవచ్చు అని అంటుంది. లోక్ నాథ్ కెమెరాతో షూట్ చేస్తుంటాడు. మేము అమెరికా నుంచి మొన్నే వచ్చాము, తనకు తెలుగు అస్సలు రాదు కానీ ఇప్పుడు తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది అని అమ్మాయి తండ్రి చెప్తాడు. లోక్ నాథ్ ను బయటకు వెళ్లిపో అంటుంది అన్నమ్మ. కట్ చేస్తే లోక్ నాథ్ ను తీసుకొని కార్లో ఇంటికి వస్తుంది అన్నమ్మ.
లోపల ఏం జరిగింది అన్నమ్మ అని లోక్ నాథ అడుగుతాడు. లోపల అమ్మాయి పేరు అడిగితే మగాడి గొంతుతో మాట్లాడుతుంది. తనను అవహించింది తన తాతా అని, వాళ్ల నాన్నకు అంత్యక్రియలు జరిపించనందుకే ఇప్పుడు వాళ్ల అమ్మాయిని ఆవహించాడు అని అన్నమ్మ చెప్తుంది. దాంతో కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతాడు అమ్మాయి నాన్న. వాళ్ల నాన్నకు ఇష్టమైన వంటకాన్ని తినిపిస్తాడు. దాంతో ఆత్మ వెళ్లిపోతుంది. పాప డాడి అని పిలుస్తుంది. ఇదంత లోక్ నాథ్ టైమ్ చేసుకుంటాడు. తరువాత అన్నమ్మతో లోక్ నాథ్ మాట్లాడుతాడు.
అన్నమ్మ ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతుంది. స్త్రీని ఒక దేవతగా కొలుస్తారు. అయినా స్త్రీని ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతారు. వాళ్ల నాన్న ఒక తాంత్రిక వేత్త అని, తను మంచి చేస్తున్న సమయంలో వాళ్ల చెల్లి, తల్లి చనిపోయారు అని చెప్తుంది. అయినా సరే వీలైనంత మంచే చేసేవాడు అని, అలాగే ఒక రోజు వాళ్ల నాన్న కూడా మరణించినట్లు చెప్తుంది. ఆ తరువాత వాళ్ల నాన్న వారసత్వాన్ని తాను కొనసాగిస్తున్నట్లు చెబుతుంది. మీకు అతికస్టమైన కేసు ఏదైనా వచ్చిందా అని లోక్ నాథ్ అడిగితే అది 1990లో ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ కేసు చాలా పెద్ద సవాల్ గా నిలిచిందని చెప్తుంది. అలాంటి కేసు మళ్లీ ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు చూడలేదు అని చెప్తుంది. టైటిల్ పడుతుంది.
సుక్లాపేట్ 1990.. ఒక ఇంటిని ఆంథొనికి చూపిస్తాడు హౌస్ బ్రోకర్. అందులో ఒక గదికి చెక్కలు కొట్టినట్లు గుర్తించి
ఇది ఏంటంటే… అడిగి చెప్తాను అని బ్రోకర్ అంటాడు. కట్ చేస్తే ఆంటోని ఫ్యామిలీ ఆటోలో ఇంట్లోకి దిగుతారు. అక్కడ బోర్డు తీయమంటాడు ఆంథోని, పిల్లలు అల్లరి చేస్తూ ఆడుకుంటారు. ఇంత పెద్ద ఇళ్లు తక్కువ ధరకే వచ్చిందని, ఇల్లు చాలా బాగుందని ఆంథొని అమ్మ సూరమ్మ అంటుంది. సోఫీని పిలిచి తారాను పిలువు అని ఆంథొని వైఫ్ మేరీ అంటే సోఫీ చప్పట్లు కొడుతుంది. దాంతో వాళ్ల అమ్మ కొప్పడుతుంది. సోఫీ వెళ్లి తారాను పిలుచుకొస్తుంది. తనకు మాటలు రావు.
తరువాత మూసి ఉన్న గదిని తెరుస్తారు. అందులో పాత సమాను ఉందని హౌస్ బ్రోకర్ చెప్తాడు. అక్కడ సమాన్లను చూస్తాడు ఆంథొని, మ్యూజిక్ ఇనిస్ట్రిమెంట్స్ ఉంటాయి. వాటిని వాయిస్తూ సంతోషపడుతాడు. సమాన్లను షిఫ్ట్ చేస్తారు. తారా బొమ్మలను చూస్తుంది. పైకి వెళ్లి పాత సమాను ఉన్న గదిలో చూస్తుంది. అక్కడ వీలు చైరును ఆడిస్తుంది. మద్దెలను కొడుతుంది. చైర్ పై కూర్చుంటుంది. ఏదో కదలినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తంది. సౌండ్ వినిపిస్తే చెవులు మూసుకొని వెళ్తుంది.
తరువాత మేరీ క్యాండిల్స్ ముట్టిస్తుంది. ఈ ఇంటికి వచ్చిన సందర్భంగా అబ్బాయే పుడతాడు అని చెబుతుంది. తరువాత డిన్నర్ చేస్తుంటే ఆంథొనితో ఈ సారి మీకు అబ్బాయే పుడుతాడు అని సూరమ్మ అంటుంది. ప్రేయర్ చేసుకొని అన్నం తింటారు. తారా మళ్లీ పైకి వెళ్లి ఆ గదిలో చూస్తుంది. బయపడి పరుగెత్తుకుంటూ వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. మేరీ వచ్చి చూసి లైట్ ఆఫ్ చేసి వెళ్తుంది. అదే సమయంలో గదిలో ఉన్న కీలు గుర్రం కదులుతుంది. పిల్లలు పడుకొని ఉంటారు. సోఫియాకు ఏవో మాటలు వినపడి లేస్తుంది. తారాను లేపి నువ్వు మాట్లాడావా అని అంటుంది. నేను ఎలా మాట్లడగలను అని తారా సైగ చేస్తుంది.
తరువాత సీన్లో మేరీ టెస్ట్ చేయించుకుంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని డాక్టర్ చెప్తారు. ఆడబిడ్డా, మగబిడ్డా అని మేరీ అడుగుతే డాక్టర్ కొప్పడుతుంది. తరువాత ఇంటికి వస్తారు. ఇంట్లో సూరమ్మ మళ్లీ అబ్బాయి గురించి అడుగుతుంది. ఎప్పుడు చూసినా అబ్బాయి అని అంటుంటావు అని సోఫియా అంటుంది. దాంతో ఆంథొని కొప్పడుతాడు. తాను స్కూల్ వెళ్తా అని లేచి వెళ్లిపోతుంది. తారా చేతులపై గాయాలును చూసీ ఎలా తగిలాయి అంటే ఏమో అని అంటుంది. అదే సమయంలో అందరికి ఏదో శబ్దం వినిపిస్తుంది. వెళ్లి చూస్తే జీసస్ ఫోటోలు అన్ని కింద పడుతాయి. సూరమ్మ వచ్చి తన హస్బెండ్ ఫోటోను క్లీన్ చేయబోతుంటే తన చేయి తెగి ఫోటోకు రక్తం అంటుంది. దాన్ని తూడిచే ప్రాసెస్ లో ఫోటో మొఖం పాడు అవుతుంది. ఇంకా నాన్నకు కోపం పోలేదు అనుకుంటా అనగానే ఆంథొని అదేం కాదులే అని అంటాడు.
అక్కడికి తారా వస్తుంది. కంగారు పడకు అని మేరీ చెప్తుంది. అన్ని ఒకే సారి ఎలా పడ్డాయి అని ఆలోచిస్తుంటే ఆ మూలన ఒక ఫోటో కనిపిస్తుంది. తరువాత ఆంథొని రెడీ అయి వెళ్తుంటే తారా బొమ్మలు వేసుకుంటుంది. అది చూసి ఆంథొని వెళ్తాడు. అదే సమయంలో కుర్చి తారా వైపు కదులుతుంది. అక్కడ ఏదో పొగ వస్తుంది. తరువాత తారా చైర్లో కూర్చొని ఊగుతుంది. అదే సమయంలో మేరీ వచ్చి మళ్లీ కింద పడుతావా అని తిట్టి డోర్ వేసి వెళ్తుంది.
తరువాత సీన్లో రైస్ మిల్ ఓనర్ వచ్చి ఇన్ కమ్ టాక్స్ వాళ్లతో ప్రాబ్లమ్ గా ఉందని, ఒక రెండు నెలలు నువ్వు ఒక్కడివే మిల్లును చూస్కో అని వెళ్తాడు. తరువాత సాయంత్రం అవుతుంది ఇంటికి వెళ్దామని స్కూటర్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవదు. అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి లాంతరు ఇచ్చి వెళ్తాడు. అది తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఆంథొని భయపడుతాడు. అదే సమయంలో ఒక అతను దారిలో కనిపిస్తాడు. అతన్ని ఆంథొని హెల్ప్ అడుగుతాడు. అతను మాట్లాడుకుంటూ వచ్చి ఇళ్లు రాగానే అతను మాయం అవుతాడు. ఎంత పిలిచినా కనిపించడు. త్వరగా వచ్చి బావి దగ్గర మొహం కడుక్కుంటే అతని కాల్లు కనిపిస్తాయి. దాంత ఆంథొని భయపడుతాడు. వచ్చి డోర్ గట్టిగా కొట్టి మేరీని తీయమంటాడు. హడావిడిగా ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగుతాడు. ఏం జరిగింది అని మేరీ అంటుంది.
కట్ చేస్తే సూరమ్మ ఒక చైన్ ఇచ్చి ఏం ఆలోచించకు పడుకో అని చెప్తుంది. ఆంథొని పడుకొని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో సోఫి రూమ్ లో ఎవరో సౌండ్ చేసినట్లు అనిపిస్తుంది. సోఫి లేచి రూమ్ అంతా చూస్తుంది. ఎవరు ఉండరు. ఒక్కసారిగా తారా తన బెడ్ పక్కనే కనిపిస్తుంది. సోఫీ భయంతో అరుస్తుంది. ఆంథొని, మేరీ వచ్చి ఏం జరిగింది అంటాడు. తారా ఏదో మాట్లాడిందని సోఫి చెప్తుంది. తనకు మాటలు రావు కదా తారా ఎలా మాట్లాడుతుంది అని మేరీ అడుగుతుంది. ఇలా జరగడం రెండో సారి అని సోఫి చెప్తుంది. అదే సమయంలో సూరమ్మ వచ్చి ఏదో సర్థి చెప్తుంది. తరువాత పిల్లు పడుకుంటారు. సోఫి నా మాట ఎవరు వినడం లేదని బాధపడుతుంది. తారా కళ్లు తెరుస్తుంది.
తెల్లారుతుంది. ఆంథొని స్కూటర్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్ కు వెళ్తాడు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారు. తరువాత కార్పెంటర్ వుడ్ వర్క్ చేస్తుంటాడు. అదే సమయంలో తారా, సోఫీ ఇద్దరు ఆడుకుంటూ కార్పెంటర్ వాళ్ల చెల్లితో మాట్లాడుతారు. వాల్లు ముగ్గురు ఆడుకుందామని పైకి వెళ్తారు. అదే సమయంలో పైకి వస్తూ కార్పెంటర్ ను చూసి మేరి భయపడుతుంది. తరువాత పిల్లల దగ్గరకు వెళ్తే వాళ్లు పచ్చీస్ ఆట అడుకుంటున్నా అంటారు. ఎవరు నేర్పించారు అంటే కార్పెంటర్ వాల్ల చెల్లే అంటారు. తనేది అంటే ఇప్పుడే కిందికి వెల్లింది అని చెప్తారు. మరో సీన్లో జూస్ ఇచ్చి మీ చెల్లికి కూడా ఇవ్వు అని మేరి అంటుంది. కార్పెంటర్ వింతగా చూస్తాడు.
రాత్రి సమయంలో ఇంట్లో జీసస్ దగ్గర దీపాలు ఆరిపోతాయి. సూరమ్మ పడుకున్న గదిలో చైర్ కదులుతుంది. లేచి చైర్ పక్కన పెట్టి మళ్లి పడుకోవాడనికి వస్తుండగా చైర్ మళ్లీ కదులుతుంది. దాంతో ఇదంతా చేస్తున్నది తన భర్తే అని అతని ఫోటోకు మొక్కుతుంది. కట్ చేస్తే తెల్లావారుతుంది. సూరమ్మ కిచెన్ లోకి వచ్చి నీల్లు తాగుతుంది. రాత్రి నిద్ర పట్టలేదా అంటే లేదురా అంటుంది. రైస్ మిల్ ఉద్యోగం గురించి చెప్తాడు. ఇంకో బిడ్డను పెంచడం కష్టం అవుతుంది అని అబార్షన్ చేయిస్తా అంటాడు వెంటనే ఆంథొనిచెంపమీద కొడుతుంది. అదేంటి ఎన్నడూ లేనిది ఇలా వింతగా ప్రవర్తిస్తుంది అని ఆంథొని మేరీతో అంటాడు. అది తారా చూస్తుంది.
రాత్రి అవుతుంది. ఆంథొని పడుకొని ఉంటాడు. ఏదో అలికిడి వినిపిస్తుంది. మెల్లిగా కిందికి వస్తాడు. బావి దగ్గర తారా కనిపిస్తుంది. డోర్ తీసుకొని వెళ్లగానే బిల్డింగ్ పైన ఎవరో ఒక ఆవిడ, పిల్లలు కనిపిస్తారు. కళ్లు తుడుచుకొని చూస్తే వారు కనిపించరు. తారా కూడా కనిపించదు. తారా బావిలో పడింది అనుకొని బావి దగ్గరకు వెళ్లగానే ఎవరో వెనుకనుంచి తనను నెడుతారు. ఆంథొని బావిలో పడిపోతాడు.
ఉదయం మేరీ నిద్ర లేచేసరికి ఆంథొని కనిపించడు. ఇల్లంతా వెతుకుతూ… అత్తయ్యను, పిల్లలను అడుగుతుంది. తరువాత ఆంథొని గొంతులా వినిపిస్తుంది అని మేరీ వెతుక్కుంటూ వస్తుంటే నూతిలో కనిపిస్తాడు. దాంతో హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఒక ఇద్దరు వచ్చి అతన్ని పైకి తీసుకొస్తారు. తరువాత ఆంథొని మాట్లాడుతూ.. ఈ ఇంట్లో ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్తాడు. అదే సమయంలో ఫోన్ వస్తుంది. అర్జెంటుగా మిల్లుకు వెళ్లాలని వెళ్తాడు. తరువాత సోఫీ హౌం వర్క్ చేసుకుంటుంటే తారా ఆడుకోవడానికి వస్తావా అంటే రాను అంటుంది. తారా కార్పెంటర్ వాల్ల చెల్లెలుతో ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్తుంది.
మేరీ వచ్చి తారా గురించి అడిగితే బయటకు ఆడుకోవడానికి కార్పెంటర్ వాళ్ల చెల్లెలుతో బయటకు వెళ్లింది అని చెప్తుంది. ఈ టైమ్ లో ఎలా బయటకు వెళ్తుంది అని లాంతరు పట్టుకొని వెళ్తుంటే దారిలో ఒక అతను వస్తాడు. చిన్న పిల్లలను చూశారా అంటే అక్కడ ఉన్నారు అని చెప్తాడు. అదే సమయంలో తారా ఒక్కర్తే నడుచుకుంటూ వెళ్తుండడం అన్నమ్మ గమనిస్తుంది. వెంటనే కారు ఆపి తారాను ఎక్కించుకుంటుంది. అదే సమయంలో మేరీ కార్పెంటర్ ఇంటికి వెళ్తుంది. తనకు చెల్లెలు ఎవరు లేరని చెప్తాడు. దాంతో మేరీ కంగారు పడుకుంటూ వస్తుంటే ఎదురుగా కార్లో వస్తున్న తారా వాళ్ల అమ్మ అని చెప్తుంది. కారు ఆపగానే తారా మేరి దగ్గరకు వెళ్తుంది. ఇక్కడికెలా వచ్చావు అంటే, నాకు ఏం గుర్తుకు లేదు అని చెప్తుంది తారా. వారిని కార్లో ఎక్కించుకొని అన్నమ్మ వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఆ ఇంటిని చూసి అన్నమ్మ డౌట్ పడుతుంది.
రాత్రి ఇంట్లో అందరూ పడుకొని ఉన్నప్పుడు ఆంథోని తల్లి మూసి ఉన్న గదినుంచి ఎవరో ఏడచి నట్లు అనిపిస్తుందని చూసి భయపడుతుంది. ఇదే విషయాన్ని ఆంథొనికి చెబుతుంది. పిల్లలు కూడా లేచి వస్తారు. అంతలో కరెంట్ పోతుంది. క్యాండిల్ వెలిగించి ఆ గదిలోకి వెళ్తాడు ఆంథొని, ఒక్క సారిగా చైర్ ఊగుతుంది. దాన్ని ఆపి ఎవరు అంటూ అటు ఇటూ చూస్తుండగా క్యాండిల్ ఆరిపోతుంది. మేరిని అగ్గిపెట్టే అడిగి ముట్టిస్తాడు. వెనక ఏదో పొగ వస్తుంది. కాసేపటికి మళ్లీ క్యాండిల్ పోతుంది. రూమ్ నుంచి బయటకు వెళ్దాము అనుకుంటే డోర్ క్లోజ్ అవుతుంది. తరువాత క్యాండిల్ వెలిగించి చూస్తుండగా ఒక లేడీ ఎదురుగా కనిపించి ఆంథొని గొంతుపడుతుంది.
తెల్లవారుతుంది. పోలీసు, హౌస్ బ్రోకర్ వస్తారు. ఆంథొని అని పిలుస్తూ పైకి వస్తారు. ఆ గదిలో ఉన్నాడు అని చెప్తారు. దాంతో పోలీసు వచ్చి డోర్ తీస్తాడు. ఆంథొని భయంతో వణికిపోతాడు. రాత్రంతా ఆ గదిలో ఎందుకు ఉన్నారు అని పోలీసులు అడుగుతాడు. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అతను వెళ్లిపోతాడు. మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందే ఈ ఇంటి వలన అని హౌస్ బ్రోకర్ ను గళ్ల పట్టుకొని అడుగుతాడు. దాంతో మీకు అన్యాయం చేయాలని మీకు అమ్మలేదు, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని, ఆ లోపు అన్నమ్మని కలువమని నెంబర్ ఇస్తాడు. రైస్ మిల్ కు వచ్చి అన్నమ్మకు ఫోన్ చేస్తే అన్నమ్మ లిఫ్ట్ చేయదు.
తరువాత వర్షం పడుతుంటే ఇంటికి వచ్చి ఇల్లు మారాలి, పొద్దునే వెళ్లాలి అన్ని సమాన్లు సర్ధమని చెప్తాడు. సమాన్లు సర్దుతుంటే మేరీ కింద పడుతుంది. తనను తీసుకొని ఆసుపత్రికి వెళ్తాడు ఆంథొని. డాక్టర్లు టెస్ట్ చేసి బ్లీడింగ్ అవుతుంది అని, ఎక్స్ రే తీయాలని చెప్తారు. అదే సమయంలో ఆంథొని తల్లి ఫోన్ చేస్తుంది. విషయం అడిగితే టెస్టులు చేస్తున్నారు అని చెప్తాడు. తెల్లవారు జామున ఆసుపత్రికి అన్నమ్మ ఫోన్ చేస్తుంది. నన్ను కలువాలను కుంటున్నావా, ఇంకో రెండు రోజుల్లో వస్తాను, ఆ ఇంటిని విడిచి పెట్టి వెళ్లకండి అని చెప్తుంది. నన్నెవరు ఆపుతారు అని ఆంథొని అంటాడు. నువ్వు ఆ ఇంటింని విడిచిపెట్టి వెళ్లలేవు అని ఫోన్ పెట్టేస్తుంది. తరువాత ఆంథొనికి తన కూతురు సోఫి ఫోన్ చేస్తుంది. నాన్నమ్మ చనిపోయింది అని చెప్తుంది. భయం వేస్తుంది మీరు ఎప్పుడొస్తారు అని అడుగుతుంది. ఆంథొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటర్ మిషన్ పడుతుంది.
లోక్ నాథ్ అన్నమ్మతో ఆత్మల గురించి అడుగుతాడు. అసలు మరణం తరువాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు. కట్ చేస్తే సుక్లాపేట 1990 టైటిల్ పడుతుంది. అన్నమ్మ ఆంథొని ఇంట్లోకి వస్తుంది. అదే సమయంలో అతని తల్లి అంత్యక్రియలు జరుగుతుంటాయి. అన్నమ్మ ఇళ్లంత తిరిగి చూస్తుంది. అక్కడ ఫాస్టర్స్ ప్రేయర్ చదువుతుంటారు. అన్నమ్మ సురమ్మ గదిలోకి వెళ్తుంది. అక్కడ సూరమ్మ చైర్లో కనిపిస్తుంది. నువ్వు ఎలా చనిపోయావు అని అడిగితే తాను ఏం చెప్పకుండా వెళ్లిపోతుంది.
అన్నమ్మ చెప్పినట్లు మనం ఆ ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్లవద్దు, నేను మీకు తోడుగా ఉంటా అని మేరీ అంటుంది. అదే సమయంలో అన్నమ్మ మంత్రాలు చదువుతుంది అక్కడ మరో వ్యక్తి కనిపిస్తుంది. నువ్వేనా ఇదంతా చేసింది అని అన్నమ్మ అంటుంది. తాను కూడా మాయం అవుతుంది. అంత్యక్రియలు జరిగే చోటుకు అన్నమ్మ వస్తుంది. ఆంథొని తండ్రి ఫోటో తీసుకొని వస్తుంది. దాన్ని సమాదిలో వేస్తుంది.
ఫోటో పూడ్చేస్తే వాళ్ల సమస్య తీరిందా అని లోక్ నాథ్ అడుగుతాడు. ఆ ఫోటో అన్నమ్మ ఇంట్లో కనిపిస్తుంది. తరువాత అన్నమ్మ మేరీతో ఇల్లంత తిరిగి చూస్తుంది. అక్కడే గోడకు సమాదిలో పడేసిన ఫోటో కనిపిస్తుంది. అది చూసి మేరి భయపడుతుంది. ఇక ఆట మొదలైందని అన్నమ్మ అంటుంది. తరువాత ఆంథొని కుటుంబంతో మాట్లాడుతుంది. ఈ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయి అని అన్నమ్మ చెబుతుంది. వాటి గురించి తెలుసుకోవాలంటే ఏదో శక్తి అడ్డు పడుతుందని చెబుతుంది. అదే సమయంలో తారా చేయిని చూస్తే ఏవో దెబ్బలు కనిపిస్తాయి. అవి ఎలా జరిగాయి అంటే తారాకు ఏం తెలియదు అని చెప్తుంది. తారా కిటికీ నుంచి చూస్తుంటే అన్నమ్మ అటుగా చూస్తే ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని చూడగానే ఇద్దరు పిల్లలు పచ్చీస్ ఆడుకుంటారు.
తరువాత ఆంథొని కుటుంబంతో ఆ ఇంటి గురించి చెబుతుంది. చాలా కాలం క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. చాలా సంతోషంగా ఉన్న ఆ కుటంబంలో కలహాలు వచ్చాయి అని చెప్తుండగా తన ఫేస్ మిర్రర్ లో కనిపిస్తుంది. తరువాత పక్కనే ఉన్న టేబుల్ పై బొమ్మలు కదులుతాయి. వైర్ తన మెడకు చుట్టుకుంటుంది. ఆంథొని కాపాడడానికి ట్రై చేస్తే అతన్ని ఆత్మ దగ్గరకు రానివ్వదు, దూరంగా విసిరేస్తుంది. అన్నమ్మ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. చివరకు గోడకు శిలువను పట్టుకొని తనను తాను కాపాడుకుంటుంది. ఆంథొని సెట్ అయి తన పిల్లలను దగ్గరకు తీసుకుంటాడు. నేను మీతో ఉంటే మీకు కూడా ప్రమాదం ఈ అమవాస్యలోగ దీనికి పరిష్కారం కనుక్కొని వస్తా, మీ చిన్న కూతురు జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది.
సూక్లాపేట్ ప్రస్తుతం అని టైటిల్ పడుతుంది. కార్లో అన్నమ్మ వస్తుంది. లోక్ నాథ్ తనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ కథ గురించి అడుగుతాడు. కెమెరా ఫిక్స్ చేస్తాడు. ఆంథొని ఇంట్లో డిన్నర్ చేస్తుంటే తారా నాకు ఈ సాంబార్ అన్నం వద్దు అని అంటుంది. నోరు ముసుకొని తినూ అని మేరీ అంటే నాకు వద్దు అని ప్లేట్ ను గట్టిగా విసురుతుంది. మరో రోజు తారా రెండు చేతులతో కలుపుతుంది. తారా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. అదే సమయంలో అన్నమ్మ చాలా మందిని కలిసి వివరాలు తెలుసుకుంటుంది. తాలపత్రాలు చదువుతుంది. ఆంథొని ఇంట్లో సఫర్ అవుతాడు.
కట్ చేస్తే సూరమ్మ నిద్ర లేస్తుంది. పిల్లలు పైన ఎలా ఉన్నారో ఏమో అని బయటకు వస్తుంది. సర్ది పెట్టిన సమాన్లు అని కదులుతాయి. సూరమ్మ భయపడుతుంది. మెట్లమీద ఎవరో నిలబడి ఉంటారు. తనను చూసి భయపడి వెన్నక్కి వస్తుంది సూరమ్మ. ఆ పిశాచి వెనక్కి నెట్టెస్తుంది. దాంతో సూరమ్మ చనిపోతుంది. అదే విషయాన్ని అన్నమ్మ గ్రహిస్తుంది.
తరువాత సీన్లో కార్పెంటర్ మూసిన డోర్ ఓపెన్ చేస్తాడు. దానికి ఆంథొని అతని మీద అరుస్తాడు. మేకులు గట్టిగా కొట్టమని చెప్తాడు. ఆ ప్రాసెస్ లో అతని చేయి మీద కొట్టుకుంటాడు. రక్తం కారుతుంది. ఆ ఇంట్లో ఉన్న మేకప్ పెట్టే గురంచి చెప్తాడు. తరువాత కార్పెంటర్ వెళ్లిపోతుంటే, అదే సమయంలో అన్నమ్మ తన మనుషులతో వస్తుంది. తన మనుషులను పరిచయం చేస్తుంది. మీరు ఇదే ఇంట్లో ప్రశాంతంగా ఉండేలా నేను చేసుకుంటా అని అంటుంది. ఆంథొని సంతోషపడుతాడు.
రాత్రి డిన్నర్ చేసేసమయంలో ప్రేయర్ చేసుకుంటారు. అదే సమయంలో కరెంట్ పోతుంది. ఆ సమయంలో జీకే పిలుస్తాడు. అన్నమ్మ వెళ్లి మర్రి చెట్టుమీద చూడగానే అక్కడ అస్తిపంజరం కనిపిస్తుంది. తెల్లవారు పిల్లలు ఆడుకుంటుంటే అన్నమ్మ వాళ్ల మనుషులతో మాట్లాడుతుంది. అదే సమయంలో తారాను ఎవరో పిలిచినట్లు అనిపిస్తే చెట్లవైపు వెళ్తుంది. తనను వెతుక్కుంటూ ఆంథొని వెళ్తాడు. తారా చెట్టు చుట్టు తిరుగుతుంటుంది. ఆపడానికి వెళ్తుంటే అన్నమ్మ వద్దని అంటుంది. అలానే తిరగనివ్వు అని చెబుతుంది.
చిన్న పిల్ల ఆస్తిపంజరం చూపించి ఈ పాపను వాళ్ల నాన్నే అతి కీరతంగా చంపాడు అని చెప్తుంది. ఆ ప్రాసెస్ లోనే ఆ పాప ఆ చెట్టుమీద దాక్కొని ప్రాణాలు వదిలింది అని చెప్తుంది. అదే సమయంలో తారా పడిపోయింది అని చెప్తారు. తారాను ఇంట్లోకి తీసుకొస్తారు. టేబుల్ మీద పడుకోబెడుతారు. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసేస్తారు. ఇంటిని తాడుతో దిగ్బందనం చేస్తారు. పూజ మొదలు పెడుతారు. పాపను టేబుల్ మీద పడుకోబెట్టి జీకే ప్రేయర్ చదువుతుంటాడు. తారా ఆకాలిగా ఉందని మాట్లాడుతుంది. అది నమ్మొద్దు అని అన్నమ్మ చెప్తుంది. తరువాత పూజ కొనసాగిస్తారు. తారా మళ్లీ వింతగా ప్రవర్తిస్తుంది. తన చుట్టు దిగ్బందనం చేసి మంత్రాలు పటిస్తారు. తనపై పవిత్ర జలం పోస్తుంటే అది తారా బాడీపై పడి ఆవిరి అవుతుంది. అదే సమయంలో డోర్లు తెరుచుకుంటాయి. పాప గాల్లో తేలుతుంది. తారా ఏడుస్తుంది. తరువాత మీ అందరిని చంపేస్తా అని బెదిరిస్తుంది పాప. పై నుంచి గదిలోకి వెళ్తుంది.
అందరూ లాంతర్లు పట్టుకొని తారాను వెతుకుతారు. ఆ గదిలో తారా ఉండదు. జీకేను లేపి అన్నమ్మ గదిలోకి వచ్చి నేను తారాను తీసుకొస్తా అని అందరిని వెళ్లిపో అంటుంది. తారాను వెతుకుతూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారు. అక్కడ చాలా మంది పిల్లలు కనిపిస్తారు. వారిని చూసి ఆర్యా భయపడుతాడు. నువ్వు చూస్తున్నది నిజం కాదు అని అతన్ని లేపి ఒక పెట్టెను తెరిపిస్తుంది. అందులో చిన్న పిల్లల అస్తిపంజరాలు కనిపిస్తాయి. దాంతో గతం అన్నమ్మ తెలుసుకుంటుంది.
సుక్లాపేట్ 1930 అని టైటిల్ పడుతుంది. మగసంతానం కలుగాలనే నలుగురు ఆడపిల్లలు ఉన్నప్పటికీ మళ్లీ తాను కడుపుతో ఉంటుంది. మళ్లీ పుట్టబోయేది ఆడపిల్లే అని మూడనమ్మకంతో తన కడుపులో బిడ్డ ఆడా, మగా అని తెలుసుకోవాలనుకుంటారు. కడుపులో బిడ్డ ఆడబిడ్డ అని మంత్రగత్తే చెప్పగానే అతను పిండాన్ని చంపేస్తాడు. తరువాత తన బిడ్డలను వేటాడి వెంటాడి చంపేస్తాడు. అందులో ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి చెట్టు ఎక్కుతుంది. పిండాన్ని పాతి పెట్టిన మంత్రగత్తే వెళ్లిపోతుంది. అదే గదిలో తారా ఏడుస్తుంది. తనకు మంత్రించి బయటకు తీసుకొస్తారు..
గదిలో దొరికిన మేకప్ కిట్ చూస్తుంది అన్నమ్మ. మళ్లీ రక్షణ దిగ్బందనం వేస్తారు. తారాను పడుకో బెడుతారు. తారా మీద మంత్రం పనిచేయడం లేదు అని జీకే చెప్తాడు. 60 సంవత్సరాల క్రితం పుట్టాల్సిన ఆ పిండం ఇప్పడు శక్తినంత కూడగట్టుకొని తారాను ఆవహించింది. అందుకే కడుపుతో ఉన్న మేరీ మీద ఇంత వరకు ఏ దాడి జరగలేదు అని చెప్తుంది. పూజ మొదలు పెట్టాలని చెప్తుంది. మేరీ పూజ మొదలు పెడుతుంది. ఆ పిల్లల అంత్యక్రియలు చేయాలని అన్నమ్మ చెప్తుంది. ఆంథొని ఆస్తిపంజరాలను తీసుకొని వెళ్తాడు. అక్కడికి నాయుడమ్మ వచ్చి డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. అయినా మాట వినకుండా చితి అంటిస్తాడు. సోహెల్ వస్తాడు. ఆంథొని లోపలికి వెళ్తాడు. నాయుడమ్మ వచ్చి అతన్ని రెచ్చగొడుతాడు. సోహెల్ అతని కళ్లలోకి చూస్తాడు. నాయుడమ్మ సోహెల్ ను ఆవహహిస్తాడు.
పూజ జరుగుతుంటే సోహెల్ వచ్చి ఆంథొని మెడ పట్టుకుంటాడు. తనలో నాయుడమ్మ ప్రవేశించాడు అని అన్నమ్మ నిర్ధారించుకుంటుంది. తరువాత అన్నమ్మ మెడపట్టుకుంటాడు. ఆంథొని తన తలపై కొడుతాడు. అదే సమయంలో అనమ్మ మంత్రించిన తన లాకెట్ ను తన మెడలో వేస్తుంది. నాయుడమ్మ వెల్లిపోతాడు. తారా లేస్తుంది. ఆంథొని అన్నమ్మకు చేతులెత్తి మొక్కుతాడు. ఉదయం ఆంథొని ఫ్యామిలీ అన్నమ్మకు వీడ్కోలు చెప్తారు. ఆంథొని ఫ్యామిలీని అన్నమ్మ సేవ్ చేస్తుంది. ఇదే విషయాన్ని లోక్ నాథ్ కు చెప్తుంది అన్నమ్మ. తరువాత అన్నమ్మకు ఫోన్ వస్తుంది. ఒక ఇంట్లో ఆపద ఉందని కాల్ వచ్చింది నువ్వు వెళ్లు లోక్ నాథ్ అంటే నేనూ వస్తా అంటాడు. సరే అని అతన్ని తీసుకెళ్తుంది. అదే సమయంలో అక్కడ చనిపోయిన కుక్క ఉంటుంది. ఊరు అవతల పడేయమంటే ఇక్కడే పడేశారా అని అంటూ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ చూస్తే ఎవరు ఉండరు. కార్లో తన బ్యాక్ ఉంటుంది. కిటికి దగ్గర అన్నమ్మ నిలబడి ఉంటుంది అక్కడికి లోక్ నాథ్ వచ్చి నాయుడమ్మలా మారుపోతాడు. ది ఎండ్ పడుతుంది.