Irugapatru: మ్యారేజ్, రిలేషన్ షిప్ వీటిని మనం కేవలం ఎమోషనల్ ఫీలింగ్స్ మాత్రమే అనుకుంటున్నాము వాటి వెనుకున్న సైన్స్ ను అర్థం చేసుకోవడం లేదు. 8 గంటలు పనిచేయడం కోసం చాలా చదువుకుంటాం కానీ, ఒక పార్ట్ నర్ తో జీవితాంతం ఎలా ఉండాలో ఎక్కడ చదువుకోము అంటూ తన పేరు మిత్ర మనోహార్ కపుల్స్ సైకాలజిస్ట్ అని పరిచయం చేసుకుంటుంది మిత్ర. తన దగ్గరకు వచ్చిన కపుల్స ప్రాబ్లమ్స్ గురించి చెబుతుంది. చెప్పింది చేయడం లేదు, లేటుగా రెడీ అవుతుంది. ఎక్కువ ఫోన్ వాడుతుంది లాంటి సిల్లీ రీజన్స్ ను చెబుతారు క్లయింట్స్. కపుల్స్ గొడవ పెట్టుకోవాలంటే పెద్దగా కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. భార్యభర్తలు అనే బంధం ఒకటి చాలు గొడవ పడడానికి అంటుంది. అయితే ఈ గొడవలన్నింటికి రెండె కారణాలు ఒకటి కమ్యూనేషన్.. అంతా నీవల్లే అనే బ్లేమింగ్ మాటలు మానేస్తే కమ్యూనికేషన్ లో పాస్. రెండు కనక్షన్ మన ఫోన్ స్క్రీన్ ను చూసినంత సమయం కూడా మన పార్టనర్ కళ్లలో చూడడంలేదు. రోజుకో నిమిషం పార్ట్ నర్ కళ్లలో చూడండి.. కావాలంటే ఇప్పుడు కూడా చూడొచ్చు అని చెబుతుంది. అందరు తమ పార్టనర్ కళ్లలో చూస్తూ ఉంటారు. మూవీ టైటిల్ పడుతుంది.
చదవండి:Harihara Veeramallu: కోసం రంగంలోకి మరో డైరెక్టర్?
తరువాత ఇన్ని చెబుతున్న తన రిలేషన్ లో గొడవలు రావా అంటే రావు అని అంటుంది. ఇంత మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనుభవంతో వారు చేసిన ఏ తప్పులను తన హస్బెండ్ దగ్గర చేయను అని, తాను బాధపడే ఏ పని చేయను అని చెబుతుంది. తరువాత సీన్లో రోడ్డుమీద వెళ్తున్న కార్లో మిత్ర భర్త మనుతో పక్కనే ఉన్న క్లైంట్ మాట్లాడుతాడు. ఇన్ని రోజులుగా మీ మధ్య ప్రాబ్లమ్స్ రాలేదా అంటే లేదు అంటాడు మను. మీ ఫోన్ చెక్ చేసినప్పుడు కూడా రాలేదా అంటే తన వైఫ్ అసలు ఫోన్ ముట్టుకోదు అంటాడు. ఎప్పుడు మీ వైఫ్ మీద అరవలేదా అంటే.. పెళ్లైన కొత్తలో అని అంటాడు. కట్ చేస్తే ఎంత సేపు చీర కట్టుకుంటావు.. మనం వెళ్లే లోపు ఫంక్షన్ అయిపోతుంది అని అరుస్తాడు మను. మిత్ర వచ్చి అలానే మిర్రర్ ముందు చూసి అరవమంటుంది. అలా రెండు, మూడు సార్లు అరవమంటుంది. చీవరిగా నెమ్మదిగా మిత్ర త్వరగా చీర కట్టుకో అంటాడు. ఇక ఎప్పుడు కోపం వచ్చినా మిర్రర్ ముందు నిలబడి ఇలానే మాట్లాడమని అంటోంది. అలా తను ఏ పనిచేసినా దానికి సైకాలిజీలో చెబుతుంది. బోర్డుమీద గీసి మరి ఎక్స్ ప్లైన్ చేస్తుంది. కోపం వస్తే యోగా చేపిస్తుంది. నెంబర్స్ కౌంట్ డౌన్ చేయిస్తుంది. చదవని బుక్స్ ఇస్తుంది. పిల్లల గురించి అడిగింతే అప్పుడు ఇలా జాలిగా కౌగిలించుకోవడం కుదరదు అంటుంది. తాను లేట్ వచ్చినందుకు అడిగితే సైలెంట్ గా వెళ్తుంది మిత్ర.
మరో సీన్లో మార్నింగ్ నిద్ర లేచి టీ షర్ట్ వేసుకొని గురకపెట్టి పడుకుంటున్న తన వైఫ్ ను చూసి జిమ్ కు వెళ్తాడు రంగేష్. అక్కడ ఒక అమ్మాయిని చూసి లేస్ కట్టుకొని, తన పక్కనే వెళ్లి జిమ్ చేస్తాడు. ఫ్లర్టింగ్ చేస్తాడు. తరువాత సీన్లో అలరమ్ మోగుతుంది. కటెన్ తీస్తాడు అర్జున్ తన వైఫ్ చికాగు పడుతుంది. వెళ్లి స్నానం చేసి వచ్చి బెడ్ షీట్ మడత పెడుతాడు. వెళ్ళి కాఫీ తాగుతుంటే దివ్య అక్కడినుంచి లేచివెళ్లిపోతుంది. తరువాత సీన్లో తన వైఫ్ పవిత్రను తగ్గమని చెబుతాడు రంగేష్. జిమ్ కు వెళ్లమని అరస్తుంటాడు. మరో సీన్లో మిత్ర డైనింగ్ టేబుల్ దగ్గర తన హస్బెండ్ కోసం సర్ ప్రైజ్ అని పోహా వంటకం చూపిస్తుంది. దానికి మను ఎగ్జైట్ అవడు. మిత్ర అలుగుతుంది. నెక్ట్స్ అర్జున్ ఇంట్లో తింటుంటే దివ్య ఫోన్ చూస్తుంది. తినెప్పుడు కూడా ఫోనేనా అంటే క్లయింట్ కు అర్జెంటుగా మెయిల్ ఇవ్వాలి అంటుంది. దివ్వ ఏ పనులు సరిగా చేయదు. ఇలా ఏంటని అర్జున్ అడిగితే తాను ఫీల్ అవుతుంది. లిఫ్ట్ లో వెళుతూ ఈ రోజు ఎర్లిగా రావడం కుదురుతుందా నీతో మాట్లాడాలి అని దివ్వను అడుగుతాడు అర్జున్. మరో సీన్లో నేను తగ్గి చూపిస్తా అంటుంది పవిత్ర…. నెక్ట్స్ సీన్లో ఈ సారీలో నేను ఎలా ఉన్నాను అని మనును మిత్ర అడుగుతుంది. ఈ సారీలో ఎప్పుడూ అందంగానే ఉంటావు అని తన మను అంటాడు. ఈ సారీ ఇప్పుడే ఫస్ట్ టైమ కడుతున్నా అని అంటుంది. తరువాత సీన్లో పవిత్ర జిమ్ కు వెల్లి లావు ఎలా తగ్గాలి అని అందరిని అడుగుతుంది. కాని జిమ్ చేయదు. నెక్ట్స్ సీన్లో అర్జున్ ను బాస్ పిలుస్తున్నాడు అని లోపలికి వెళ్తాడు. అర్టికల్ లో ఏం రాశావు అని అరుస్తాడు. కట్ చేస్తే మిత్ర తన ఆఫీస్ కు వెళ్తుంది. క్లైంట్ తో మాట్లాడుతూ వాళ్లకు సలహా ఇస్తుంది.
జిమ్ నుంచి పవిత్ర ఇంటికి వెళ్తున్న అందరికి బాయ్ చేప్తుంది. వచ్చి ఒక్క వర్కౌట్ కూడా చేయలేదు అని అందరు అంటుంటారు. వారికి బై చెప్పి వెళ్లిపోతుంది. తరువాత సీన్లో అమెజాన్ లో ఏదైనా ఆర్డర్ పెట్టావా అని రంగేష్ కు తన పవిత్ర ఫోన్ చేస్తుంది. అర్డర్ వస్తే తీసుకోవచ్చుగా ఫోన్ చేయడం ఎందుకు అని అరుస్తాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ మాతో సరదాగానే మాట్లాడుతావు కదా నీ వైఫ్ తో ఎందుకు అలా చిరాకు పడుతావు అని అడుగుంది. నీతో దాచడానికి ఏం ముంది ఈ మధ్య నా వైఫ్ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదని, ఓవర్ గా వెయిట్ పెరిగిపోతుందని చెబుతాడు. ఇక బిడ్డకోసమే వాళ్లు చివరిసారిగా కలిశాము అని చెబుతాడు. మరి ఎందుకు కలిసున్నారు. సపరేట్ అవడం గురించి ఆలోచించారా అని రంగేష్ టీమ్ లీడర్ అడుగుతుంది. తన భర్తతో విడిపోయినప్పుడు అందరు అపోజ్ చేశారు కాని, ఎవరి లైఫ్ వాళ్లది.. కలిసుంటే సంతోషంగా ఉండాలి లేదంటే విడిపోవాలి అని చెబుతుంది. దాంతో రాంగేష్ ఆలోచనలో పడుతాడు.
మరో సీన్లో మిత్ర తన మనుకు ఫోన్ చేసి భోజనం చేశావా అని అడుగుతుంది తాను చేశాను అని చెప్తాడు. ఫోన్ పెట్టేసిన తరువాత భోచ్చేశావా అని అడిగితే భోజనం నచ్చిందా అని అర్థం ఈ మగాళ్లకు ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో అని అనుకుంటుంది మిత్ర. మిత్ర ఆఫీస్ కు ఒక క్లైంట్స్ వస్తారు. వారు ఫోన్లో తీసుకున్న పిక్ గురించి మాట్లాడుకుంటారు. ఆండ్రాయిడ్, ఓఎస్ ఫోన్ గురించి తిట్టుకుంటారు. వాళ్లను ఆగమని చెప్పి ప్రతి రోజు మీరు ఏ విషయంలో ఆర్గ్యూమెంట్స్ చేసుకుంటారో నోట్ చేసి పెట్టుకోండి. వీక్లీ ఒక హనెస్ట్ హవర్ అని పెట్టుకొని వాటి గురించి మాట్లాడుకోండి అని సలహా ఇస్తుంది.
తరువాత సీన్లో అర్జున్ తన వైఫ్ దివ్యతో ఏం మాట్లాడాలో బాత్రూంలో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇలా ఉండడం నాకు నచ్చదు అని, మాట్లాడుతుండగా అక్కడికి వాళ్ల బాస్ వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడిగితే. ఆర్టికల్ గురించి ఆలోచిస్తున్న అని చెప్తాడు అర్జున్. కట్ చేస్తే దివ్వకు అర్జున్ ఫోన్ చేస్తాడు. తాను లిఫ్ట్ చేయదు. మరో సీన్లో రంగేష్ వస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేసినట్లు అపార్ట్ మెంట్ కింద డెలివరీ బాయ్ చెప్తాడు. మటన్ బిర్యాని తీసుకొని తన ఫ్లాట్ వస్తాడు రంగేష్. భార్యతో అదోలా మాట్లాడుతుంటాడు. రేపటి నుంచి నాకు నైట్‌లో ఫుడ్ వండకు బయటే తింటా అంటాడు. నెక్ట్స్ సీన్లో అర్జున్ ఇంట్లో టీవీ చూస్తుంటాడు. డోర్ బెల్ వినిపిస్తుంది. తీస్తే దివ్వ వస్తుంది. ఎందుకు లేట్ అయింది అని అర్జున్ అడుగుతాడు. ఎందుకు అరుస్తున్నావ్ అని దివ్వ అంటుంది. ఇద్దరం కలిసి మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది. బయటకు వెళ్లి చాలా రోజులు అవుతుంది. నవ్వుతు మాట్లాడం లేదు. దగ్గరకు వస్తేనే దూరం వెళ్తున్నావు అని అర్జున్ అరుస్తాడు. దానికి దివ్వ నాకు తెలియదు నీ మీద లవ్ లేదు అని చెబుతుంది. నీ ఫోన్ వస్తే ఇరిటేషన్ వస్తుంది. ఇంటికి రావాలంటే బోర్ కొడుతుంది అని చెప్పి వాష్ రూమ్ కు వెళ్లి ఏడుస్తుంది. తరువాత బయటకు వచ్చి నన్ను కొన్ని రోజులు మా ఇంట్లో ఉండనిస్తావా అని అడుగుతుంది. ఇప్పుడేం అయింది అని అర్జున్ అడుగుతాడు. తరువాత దివ్వ ఏడుస్తుంది.
తరువాత సీన్లో మిత్రను కలుస్తాడు అర్జున్ . మ్యారెజ్ అయిన కొత్తలో చాలా బాగున్నాము అని తరువాత తాను ఆఫీస్ కు వెళ్లినప్పటి నుంచే ఇలా బిహేవ్ చేస్తుంది అని అంటాడు. మీ పెళ్లికి ముందే దివ్వ జాబ్ చేస్తుంది. ఏ గొడవకైనా ఒక రూట్ ప్రాబ్లమ్ ఉంటుంది. అదేంటో చెప్పండి అని అడుగుతుంది. దివ్వ ఎందుకు ఇలా ఉంటుంది అని ఆలోచించి మీరు ఒక ప్రెషర్ ను ఫీల్ అవుతున్నారు. దివ్వ ఆఫీస్ కు వెళ్లేముందు. త్వరగా రా నీతో మాట్లాడాలి అనే ప్రేషర్ ను తనపై చూపిస్తున్నారు. దివ్య దాన్ని ఎలా హ్యండిల్ చేయాలో అర్థం కాగ, మీకు ఆన్సర్ చేయలేక ఇంటికి లేట్ గా వస్తుంది. రాగానే మళ్లీ మీ ప్రశ్నలు అడుగడం మొదలుపెడుతున్నారు. ఆ ప్రేషరంతా తాను భరించలేక అదంత తిరిగి మీకే ఇచ్చేస్తుంది.. అందుకే కొద్ది రోజులు తన పేరెంట్స్ దగ్గర ఉంటా అంటుంది… అని మిత్ర చెబుతుంది. అలాంటప్పుడు ఆఫీస్ కు వెళ్లే ముందు నువ్వ ఏం చెప్పకుండా.. సాయంత్రం వచ్చాకా, తనను బ్లేమ్ చేయకుండా నువ్వు ఏ విషయంలో మారితే బాగుంటుందో అడిగితే తాను ఏం చెబుతుందో కదా.. అని మిత్ర అంటుంది. తరువాత తనను కౌన్సిలింగ్ కు తీసుకురాగలరా అని అడుగుతుంది.
నెక్ట్స్ సీన్లో రంగేష్ కోర్టులో లాయర్ ను కలిసి విడాకులకు అప్లై చేస్తాడు. ఇదంతా నీ వైఫ్ కు తెలుసా అంటే లేదు అని అంటాడు. మీ వైఫ్ ఒప్పుకుంటుందా అంటే నో అంటాడు. మరి కారణం ఏంటంటే లావు అవుతుంది అని చెప్తాడు రంగేష్. దానికి లాయర్ ఒప్పుకోడు. ఇలా చెప్తే మనిద్దరిని జైలులో వేస్తారు అని చెబుతాడు. దీనికి ఒకే మార్గం ఉంది అదేంటంటే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ ప్రాసెస్ అని చెబుతాడు. కట్ చేస్తే పనిమనిషి పవిత్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. సర్ ఇలా బయటే తింటా అంటున్నాడు అంటే బయట ఏదో సంబంధం పెట్టుకుంటా అని హింట్ ఇస్తున్నాడు. అయినా ఇలా నైటీ వేసుకొని సాధాసీదాగా ఉంటే ఎలా అమ్మా.. కాస్త అందంగా ముస్తాబు అయితేనే కదా మగవాడు మనం కొంగుపట్టుకునేది అని చెప్తుంది.
తరువాత సీన్లో మిత్ర తన హస్బెండ్ తో రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తుంటే పక్కనే ఒక కపుల్స్ గొడవపడుతుంటే వారిగురించి ఆలోచిస్తుంది. అది చూసి తన భర్త మనం ఎందుకు గొడవ పడటం లేదు అని అడుగుతాడు. మనం ఎలా ఉన్నా బయటవాళ్లకు మనం గొడవపడకుండా ఉండాలి కాదా అంటుంటాడు. ఆదేంటి మనం గొడవ పడాలా అని మిత్ర అంటుంది. అయితే వారానికి ఒక రోజు అర్గ్యూమెంట్ హవర్ అని పెట్టుకొన గొడవపడుదాం అని చెప్తుంది. తరువాత బిర్యాని ఆరిపోతుంది అని చెప్తాడు మను. మరో సీన్లో పవిత్ర లిప్ స్టిక్ పెట్టుకొని రెడీ అవుతుంది. అంతలో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. వెళ్లి తీస్తుంది. రంగేష్ రాగనే తనతో కొత్తగా బిహేవ్ చేస్తుంది. రంగేష్ సారీ చెప్పి తినడానికి ఏమన్నా ఉందా అని అడుగుతాడు. నిన్న ఆర్డర్ చేసిన బిర్యానిని వేడి చేస్తా అని వెళ్లిపోతుంది పవిత్ర.
మరో సీన్లో అర్జున్ దివ్వతో మాట్లాడుతాడు. తాను మిత్రను కలిసినట్లు చెప్తాడు. నువ్వు కూడా ఒకసారి మీట్ అవు అని అంటాడు. తనకు మిత్ర విజిటింగ్ కార్డు ఇస్తాడు. మరో సీన్లో రంగేష్, పవిత్ర పడుకొని ఉంటారు. పవిత్ర అలానే చూస్తూ ఉంటుంది. రంగేష్ తన వైపు తిరుగుతాడు. నిద్ర రావడం లేదా అని రంగేష్ కు కిస్ ఇవ్వబోతుంటే రంగేష్ లేచి కూర్చుంటాడు. ఏం జరిగింది అంటే నువ్వు బ్రెష్ చేయలేదా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటాడు. పవిత్ర అలా నివ్వేరపోయి చూస్తుంది. ఇక్క నిమిషం అని అక్కడినుంచి బాత్రూంకు వెళ్లి బ్రెష్ చేసుకుంటుంది. రంగేష్ బాధపడుతుంటాడు. తరువాత పవిత్ర బయటకు వస్తుంది. కట్ చేస్తే పవిత్ర ఏడుస్తుంది. మనకు ఒక కొడుకు ఉన్నాడు ఇప్పుడు విడాకులు ఏంటి అని ఏడుస్తుంది. తను హ్యాప్పిగా లేనని చెప్తాడు. నేను లావు తగ్గుతాను, మీ కోరిక తీర్చాలంటే ఏం చేయాలో, మీరు చెప్పినట్లే వింటాను అని అంటుంది. అదే ప్రాబ్లమ్ నా కోసం నువ్వు మారటం ఏంటి.. నాకు నచ్చేలా నువ్వు ఎందుకు లేవు అని అంటాడు. ఇప్పుడు నా కోసం మారినా అది ఎల్లప్పుడు ఉండదు. అందుకే లాయర్ ను కలిసి అంతా మాట్లాడాను అని చెప్తాడు. పవిత్ర ప్లీజ్ అంటూ ఏడుస్తుంది.
బంధాలు ఏ క్షణం అయినా తెగిపోవచ్చు.. ప్రేమ అభిమానులు చెదిరిపోవచ్చు.. రాత్రుల్లు వేదనగా గడవచ్చు.. అలాంటి వాటినుంచి ఎవరు తప్పించుకోలేరు అనే వాయిస్ ఓవర్ వస్తుంది. తరువాత మిత్ర తన హస్బెండ్ బీచ్ లో నడుచుకుంటు వస్తుంటే సాంగ్ మొదలౌతుంది. ఇద్దరు హ్యాప్పిగా ఉంటారు. గిఫ్ట్ లు ఇచ్చుకుంటారు. తరువాత సర్ ప్రైజ్ అంటూ తన భర్తను తీసుకొని లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్తుంది. బీచ్ లో ఆనందంగా గడుపుతుంటారు. ఫైర్ క్యాంప్ వేసుకుంటారు. వైన్ తాగుతూ డ్యాన్స్ చేస్తుంటారు. తరువాత సీన్లో పవిత్ర మిత్రను కలుస్తుంది. మీ హస్బెండ్ ఇలా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది అని మిత్ర అడుగుతుంది. దాని తరువాత ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతుంది. పవిత్ర చెప్తుంది. డివోర్స్ అని చెప్పిన దగ్గరనుంచి రంగేష్ ను బతిమిలాడుతూ ఉంటుంది. ఫోన్లో బతిమిలాడుతుంది. కాళ్లు పట్టుకుంటుంది. తరువాత వాల్ల రిలేటీవ్స్ ఇంట్లో చెప్తుంది. రంగేష్ వాళ్ల అమ్మనాన్న కూడా రంగేష్ నే తిడుతారు. ఇదే విషయాన్ని డాక్టర్ మిత్రకు చెబుతుంది. ఇక్కడే అందరూ ఆడవాళ్లు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. మగవాళ్లు డివోర్స్ కావాలి అన్నారంటే.. నాకు కొంచెం టైమ్ కావాలి, ఇప్పుడు కాస్త కన్ ఫ్యూజన్లో ఉన్నాను. కొద్ది రోజుల్లో సెట్ అవుతా అని అర్థం. ఆ సమయంలో ఆడవాల్లు వారిని డిస్టర్బ్ చేయకుంటే ఉంటే చాలు అని మిత్ర చెబుతుంది. ఇప్పుడెంటి ఫిట్ గా ఉంటావా.. ఎలా ఉన్నా పర్లేదా అని డాక్టర్ అడుగుతుంది. ఫిట్ గా ఉంటాను అని పవిత్ర చెప్తుంది. రంగేష్ ను ఒక సారి కలువాలి అని డాక్టర్ అంటుంది. సరే అని పవిత్ర అక్కడినుంచి వెళ్లిపోతుంది. అదే సమయంలో బయట దివ్య వెయిట్ చేస్తుంది.
నెక్ట్స సీన్లో దివ్వ మిత్రతో కౌన్సిలింగ్ లో కూర్చుంటుంది. అర్జున్ చాలా విషయాలు చెప్పాడు అని దాంతో మీరు కొంచెం అర్థం అయ్యారు కాని అర్జున్ అర్థం కాలేదు అంటుంది మిత్ర. సో మీ మీటింగ్ నుంచి జరిగిన విషయాలను కొంచెం చెప్పండి అని మిత్ర అడుగుతుంది. దాంతో దివ్య వాళ్ల ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. వాళ్ల పరిచయంతో సాంగ్ ప్లే అవుతుంది. తరువాత ఫ్రెండ్ ఫిప్, రిలేషన్ షిప్ తరువాత పెళ్లి అవుతుంది. వాళ్ల మధ్య చిన్న చిన్న ఇష్యూలు పెద్దవి అవుతుంటాయి. ఇంట్లో ఉండడం వలన రెస్పెక్ట్ పోయింది అని ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లాను అని దివ్య చెప్తుంది. ఆ సమయంలో జాబ్ చేయాలని నిశ్చయించుకుంటుంది. తరువాత అర్జున్ తో చెబుతుంది. అతను వద్దు అంటాడు. తరువాత ఒప్పించి దివ్య జాబ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ సంతోషంగా ఉంటుంది. అదే విషయాలను అర్జున్ తో చెబుతుంది. అతను హ్యాప్పిగా ఉండడు. పైగా నా వైఫ్ గా నీకు జీరో మార్క్స్ అని చెబుతాడు. దాంతో దివ్య బాధ పడుతుంది. అర్జున్ హార్ష్ గా మాట్లాడుతుంటాడు.. అని ఏడుస్తూ మిత్రకు చెబుతుంది. ఈ సిచ్యూయేషన్ లో తనకు చనిపోవాలని ఉంటుంది అని చెబుతూ ఏడుస్తుంది. దాంతో మిత్ర దివ్వ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటుంది.
నెక్ట్స్ సీన్లో మిత్ర ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మను భర్త పిండికలుపుతుంటాడు. మిత్ర దివ్వ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ టైమ్ హార్ట్ అయినప్పుడే చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, తరువాత బాధ పడి ప్రయోజనం లేదు అని చెప్తుంది. ఒకసారి అలవాటు అయితే జీవితాంతం అలవాటు అవ్వాల్సిందే అని చెబుతుంది. మను మాట్లాడుతూ.. స్టేజ్ వన్ లో విననప్పుడు ఏం చేస్తాం.. చివరి వరకు ఏం జరుగుతుందో జరగనీవు అని చూస్తాం దివ్యలాగా అని అంటాడు. తరువాత సీన్లో అర్జున్ దివ్య ఇద్దరు కౌన్సిలింగ్ లో కూర్చుంటారు. మీ ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అర్జున్ నువ్వు దివ్యలో తప్పులు వెతికే పనిలో బిజీ అయ్యావు తప్ప, తనను పెద్దగా పట్టించుకోలేదని మిత్ర చెబుతుంది. కాసేపు మాట్లాడుకోవడం, గిఫ్ట్ లు ఇచ్చుకోవడం, టచ్, టైమ్ ఇవి ఇస్తే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. హానెస్ట్ హవర్ అని పెట్టుకొని ఎప్పటి ప్రాబ్లమ్ అప్పుడే సాల్వ్ చేసుకోండి అని చెప్తుంది. అలాగే ప్రతి రోజు మీ పార్టనర్ చేసిన ఇంప్రెస్సీవ్ పనికి థ్యాంక్స్ చెబుతూ ఒక చీటిని జారులో వేయండి. 15 రోజుల తరువాత ఎక్స్ ఛేంజ్ చేసి చదువుకోండి అని చెబుతుంది. దానికి వారు ఓకే అంటారు.
తరువాత సీన్లో రంగేష్ ఆఫీస్ కు వెళ్తుంటే డాక్టర్ మిత్రను కలిసినట్లు పవిత్ర చెప్తుంది. డాక్టర్ ఎందుకు అని కొప్పడి వెళ్లిపోతాడు రంగేష్. తరువాత ఆఫీస్ టైమ్ లో మిత్ర రంగేష్ కు కాల్ చేస్తుంది. రంగేష్ నాకెందుకు ఫోన్ చేశారు అని అరుస్తుంటాడు. దాంతో మీ వైఫ్ కు ఒక ప్రాబ్లమ్ ఉందని చెబుతుంది. కట్ చేస్తే మిత్ర ఆఫీస్ లో రంగేష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. మిత్రతో మాట్లాడుతాడు. పవిత్ర ప్రాబ్లమ్ ఏంటి అడుగుతాడు. చెప్తా తన ప్రాబ్లమ్ కంటే ముందు మీతో మాట్లాడాలి అని చెప్తుంది. తరువాత మీకు డైవర్స్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకున్నారా అని అంటే అవును అంటాడు. తరువాత పవిత్ర నుంచి దూరం అవడానికి ఒక పది కారణాలు చెప్పమంటుంది. వాటికి తన ఓవర్ వైయిట్, డ్రెస్ సెన్స్ లేదని చెప్తాడు. తరువాత ఆగిపోతాడు. అలా ఏదో ఫిల్ చేయడానికి చెప్పకండి నిజం చెప్పండి తాను ఫిట్ గా, మోడల్ లా ఉంటే మీకు ఓకేనా అంటుంది. ప్రాబ్లమ్ పవిత్రకు అన్నారు కదా ఇప్పుడు నాకేదో ప్రాబ్లమ్ అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు నిజంగా పవిత్రకు మంచి చేయాలనుంటే డైవర్స్ ఇప్పించండి అని వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో మిత్ర తన హస్బెండ్ కు ఫెషియల్ చేసుకుంటూ తన క్లయింట్ లావుగా ఉందని తన హస్బెండ్ డివోర్స్ అడుగుతున్నాడు… నేను లావు అయితే నువ్వు వదిలేస్తావా అని మనును అడుగుతుంది. దానికి నవ్వు ఇప్పుడ ఏమన్నా సన్నగా ఉన్నావా.. లావుగానే ఉన్నావు అని అంటాడు. పాపం పవిత్ర అమయకురాలు అంటుంది. పాపం వాడికేం ప్రాబ్లమ్ ఉందో అని మను అంటాడు. వాడు పాపం ఏంటి అని అంటుంది మిత్ర. మరి హస్బెండ్ బాణా పొట్టేసుకుని ఉంటే మీకు ఓకేనా.. హస్బెండ్ ఏమో మహేష్ బాబులా ఉండాలి.. భర్యలను లక్షణంగా ఉండాలని కోరుకోవద్దా అని మను అంటాడు.. అది సరే కాని నేను నిజంగా లావుగా ఉన్నానా మిత్ర అడుగుతుంది. నేను హనెస్ట్ హావర్ లో చెప్తా అని కళ్లపై కీర పెట్టుకుంటాడు మను.
తరువాత సీన్లో పవిత్రతో మిత్ర మాట్లాడుతుంది. ఫ్యామిలీ, సోసైటీ, పిల్లలు అన్ని వదిలేసి కళ్లు మూసుకొని మీకు రంగేష్ కావాలా అని అడుగుతుంది. తాను కళ్లుమూసుకొని కావాలి అని చెప్తుంది. అయితే మీరు వెళ్లి డైవర్స్ అప్లై చేయమని చెప్తుంది. తాను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు.. మీ లావు అనేది అసలు ప్రాబ్లమ్ కాదని ఒక సారి అప్లై చేస్తే.. తనకు తెలుస్తుంది. కోర్టులో మీకు 6 నెలలు టైమ్ ఉంటుంది. ఆ సమయంలో నువ్వు లావు తగ్గాలి అని చెబుతుంది. తరువాత సీన్లో రంగేష్ తో పవిత్ర ఎప్పుడు డైవర్స్ అప్లై చేయాలో చెప్పమని అడుగుతుంది. దాంతో రంగేష్ అలానే చూస్తాడు. నెక్ట్స్ సీన్లో కోర్టులో లాయర్, మిత్రతో అమెరికాలో ఒక సంఘటన జరిగింది.. పెళ్లై 6 నెలలుగా ఒక్క గొడవ జరగలేదని ఒక అమ్మాయి డైవర్స్ తీసుకుందట అని చెప్తాడు. అదే విషయాన్ని తన హస్బెండ్ తో చెప్పి నేను ఏదైనా మార్చుకోవాలా, నేను ఫర్ఫెక్ట్ వైఫ్ హేనా అని అడుగుతుంది మిత్ర. అన్నింటిలో నువ్వు ఫర్ఫెక్ట్ అని చెప్పి హగ్ చేసుకుంటాడు మను.
తరువాత సీన్లో మిత్రకోసం ఆఫీస్ కు వెళ్తాడు తన మను. అక్కడ రిసెప్షనిస్ట్ ఒక 5 మినెట్స్ అని చెబుతుంది. అక్కడ ఒక ఇద్దరు క్లైంట్స్ కూర్చొని ఉంటారు. వాళ్లతో మాట్లాడుతాడు మను. వాళ్లు ఒక సాఫ్ట్ వేర్ డౌవలప్ చేసినట్లు, అది కపుల్స్ రిలేషన్ షిప్ ను భద్రంగా ఉంచేందుకు వర్క్ చేస్తుందని చెప్తారు. వాళ్లకు ఇష్టమైన థింగ్స్ ఎప్పుడెప్పుడు చేయాలో గుర్తుచేస్తుంది. లాంగ్ డ్రైవ్, సర్ ప్రైజ్ లు అని చెప్తారు. ఆ మాటలతో మను హార్ట్ అవుతాడు. మిత్ర పడుకున్నప్పుడు యాప్ ను చూస్తాడు. ఇన్నాళ్లు తన వైఫ్ ఒక యాప్ చెప్పినట్లు చేసిందా అని గిల్ట్ గా ఫీల్ అవుతాడు. మార్నింగ్ మిత్ర తన హస్బెండ్ ను కౌగిలించుకుంటుంది. సాంగ్ మొదలౌతుంది. అర్జున్, దివ్వలు వాళ్ల థ్యాంక్స్ నోట్స్ రాస్తారు. రంగేష్, పవిత్ర ఇద్దరు లాయర్ దగ్గరకు వెళ్లి సైన్ చేస్తారు. అర్జున్, దివ్యను ప్రేమగా చూస్తుంటాడు. మిత్ర హస్బెండ్ డల్ గా ఉంటాడు. రంగేష్ తన క్లాత్స్ సపరేట్ చేసుకుంటాడు. తరువా సీన్లో నీకు లవ్ లాంగ్వేజ్ తెలుసా కదా అని.. నీవు సైకాలజీ చదవకుండా ఉండాల్సింది అని మను అంటాడు. నెక్ట్స్ సీన్లో పవిత్ర జిమ్ లో జాయిన్ అవుతుంది. తరువాత మిత్ర హస్బెండ్ బిహేవియర్ మారుతుంది. భోచ్చేశారా అని మిత్ర ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాని ఫోన్ పెట్టేస్తాడు. తరువాత సీన్లో దివ్యను అందంగా ఉన్నావు అని అర్జున్ అంటాడు. తనను ప్రేమగా చూస్తాడు. దివ్య డ్రెస్ ఛేంజ్ చేసుకోవాడనికి డ్రెస్ తీసుకుంటుంది. అర్జున్ బయటకు వెళ్లిన తరువాతే మార్చుకుంటుంది. అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. దివ్య కూడా ఆలోచిస్తుంది.
తరువాత సీన్లో మిత్ర పోహా చేస్తుంది. ఇద్దరు కూర్చొని డైనింగ్ చేస్తుంటారు. మను ఈ రోజు బుధవారం ఏమన్నా మాట్లాడాలా అని మిత్ర అడుగుతుంది. మను అదోలా చూస్తాడు. ఏం లేకపోతే వదిలేయ్ అని మాట్లాడుతుంది. తరువాత సీన్లో థ్యాంక్యూ బాక్స్ లో స్లిప్స్ తీసి చదువుతాడు అర్జున్. అందులో ఏం ఉండదు, ఏం రాయలేదు అని గట్టిగా అరుస్తాడు. రెండు వారాలుగా అరవనందుకు ఈ రోజు థ్యాంక్స్ అని రాద్దమనుకున్నా అంతలోనే చెడగొట్టావు అని దివ్య అంటుంది. తరువాత సీన్లో ప్రాజెక్ట్ గురించి తన జూనియర్ తో గొడవపడుతాడు రంగేష్. హెచ్ ఆర్ పిలిపించి అడిగితే తన మీద కూడా అరుస్తాడు. జాబ్ మానేసి వెళ్లిపోతున్నట్లు చెప్తాడు. బయటకు వచ్చి అందరిని తిట్టి వెళ్లిపోతాడు. తరువాత తన అపార్ట్ మెంట్ లో కూర్చొని బాధపడుతుంటాడు. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బాధ పడుతాడు.
మరో సీన్లో మిత్ర వెయిట్ చేస్తుంది. మను వస్తాడు ఇంకా నిద్ర పోలేదా అని అంటాడు. లేదు నీతో మాట్లాడాలి కూర్చో అంటుంది. నాకు మూడ్ లేదు అని మను అంటాడు. సరే వదిలేయ్ మళ్లి ఎప్పుడైనా మాట్లాడుకుందాం అని అంటుంది. కొంచెం ముందుకెళ్లి.. వెనక్కి వచ్చి ఇంకెప్పుడు మాట్లాడుకుందాం అని అరుస్తాడు. గొడవలో కూడా ప్రేమ ఉంటుంది. పొసెస్సీవ్ నెస్ లో కూడా ప్రేమ ఉంటుంది. ఇన్ని రోజులు నా మీద చేసింది ఒక యాప్ ఎక్స్ పరమెంట్ హా అని మాట్లాడి వెళ్లిపోతాడు. నీ దగ్గర వచ్చిన వాళ్లకు మందులిచ్చి నయం చేస్తున్నావు. మన విషయంలో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో అని రోజు మందులేసుకుంటున్నావు అది ఏదో రోజు విషయంగా మారుతుందని మరిచిపోతున్నావు అని మను అంటాడు. మన మధ్య గొడవే లేదంటూ ఇంత పెద్ద ప్రాబ్లమ్ చెప్తున్నావుగా అని మిత్ర అంటుంది. మను బెడ్రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఉదయం అవుతుంది. మిత్ర హాల్ లోనే పడుకొని ఉంటుంది. మను వచ్చి తన బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతాడు. తరువాత డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచిపోతాడు. మిత్ర బాధపడుతుంది.
తరువాత సీన్లో అర్జున్ దివ్య ఇద్దరు మూవీ చూసి బయటకు వస్తుంటారు. తినడానికి ఎక్కడికైనా వెళ్దామని చెప్తాడు. తరువాత తనకు రూట్ చెప్పమని ఫోన్ ఇస్తాడు. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి ఆఫీస్ కు లీవ్ పెట్టు అని చెప్తాడు. తనకు టైమ్ పడుతుంది అని చెప్తుంది దివ్వ. తరువాత తినడానికి వెళ్తుంటారు. తాను రూట్ చెప్తుంటే అర్జున్ చూస్తాడు. దానికి ఇద్దరు గొడవపడుతుంటారు. నువ్వు తింగరివి అని ఒప్పుకో అని తిడుతుంటాడు. నేను తింగరిదాన్నే అని అరుస్తూ ఏడుస్తుంది. స్మార్ట్ గా ఉన్న మరెవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు కదా నన్నెందుకు ఇలా తింగరి తింగరి అని ఏడిపిస్తున్నావు అని కారు దిగి ఆటోలో వెళ్లిపోతుంది. తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది.
మరో సీన్లో రంగేష్ తో పవిత్ర మాట్లాడుతుంది. తన జాబ్ పోయింది కదా.. కావాలంటే జాబ్ కోసం తన ఫ్రెండ్స్ ని అడుగుతా అంటుంది. దానికి రంగేష్ కోపం తెచ్చకుంటాడు. హౌష్ లోన్ కట్టాలి కదా అని అంటుంది. దానికి రంగేష్ అరుస్తాడు. నాకు హెల్ప్ చేయాలనుకుంటే డైవర్స్ వచ్చేంత వరకు కామ్ గా ఉండు అంటాడు. కట్ చేస్తే పవిత్ర జిమ్ లో హేవీగా వర్క్ అవుట్ చేస్తుంది. ఒకే రోజులో తగ్గిపోలానుకుంటున్నారా అని జిమ్ మాస్టర్ అడుగుతాడు. ఇలా చేస్తే లాభం ఉండదు ఇష్టంతో చేయాలి.. అలా అనిపించినప్పుడే జిమ్ కి రా అని చెబుతాడు. నెక్ట్స్ సీన్లో అర్జున్ ను మిత్ర కౌన్సిలింగ్ చేస్తుంది. ఎందుకు తనను డమ్ అని పిలుస్తున్నావు. తాను నిజంగానే తింగరి అయినా నువ్వు అలా పిలుస్తావా అని అడుగుతుంది. నిజానికి మీ కోపం తను డమ్ గా ఉన్నందుకు కాదు మీకంటే స్మార్ట్ గా ఉన్నందుకు అని, చాలా మంది మగవాళ్లు ఇలానే బిహేవ్ చేస్తారు అని చెప్తుంది. తరువాత దివ్వతో మాట్లాడావా అని అంటే తాను ఇంటికి వెళ్లి మాట్లాడిన విషయం చెప్తాడు. తన కోపాన్ని పోగొట్టాలంటే 2 మంథ్స్ తనతో నో కాంటాక్ట్ అనే థీయరీని చెప్తుంది. తన హస్బెండ్ కూడా అదే ప్రాబ్లమ్ లో ఉన్నట్లు చెప్తుంది.
తరువాత సీన్లో మను ఫోన్ మిత్రకు ఫోన్ చేసి ఈవినింగ్ బయటకు వెళ్దామా అని చెప్తాడు. తరువాత ఇద్దరు సంతోషంగా మాల్స్, గేమ్స్, షాపింగ్, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. తరువాత ఇంటికి వస్తారు. మనుకు థ్యాంక్స్ చెప్తుంది. తరువాత మన మధ్య ఇలాంటి ప్రాబ్లమ్ మళ్లీ వస్తుందో ఏమో అని ఒక సారి ప్రేమ మేడమ్ దగ్గర కౌన్సిలింగ్ కు వెళ్దాం అని అంటుంది. దాంతో మను కోపంతో మాట్లాడుతాడు. నీ సైకాలజీని ఆఫీస్ లోనే వదిలిపెట్టి ఒక వైఫ్ గా ఇంటికి వచ్చేటట్లు అయితేనే నాతో మాట్లాడు అని చెప్తాడు. తరువాత సాంగ్ మొదలు అవుతుంది. అర్జున్ మార్నింగ్ లేచి దివ్య గురించి ఆలోచిస్తాడు. దివ్య మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ అర్జున్ కోసం ఆలోచిస్తుంది. తరువాత మను మిత్ర ఒకే ఇంట్లో ఉన్నా వేరుగా ఉన్నట్లు బిహేవ్ చేస్తారు. పవిత్ర జిమ్ కు వెళ్తుంది రంగేష్ టీ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. పవిత్ర రన్నింగ్ చేసుకుంటుంది. ఈ వర్క్ అవుట్ మీ కోసం కాదు నా కోసం అని చెబుతుంది. మిత్ర మనును కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. పవిత్ర జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుంది. అర్జున్ లాంగ్ డ్రైవ్ చేస్తుంటాడు. మిత్ర తన యాప్ ను డిలీట్ చేస్తుంది. రంగేష్ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తుంటాడు. పవిత్ర బరువు తగ్గి మోడల్ లా తయారు అవుతుంది. పాట అయిపోతుంది.
తరువాత సీన్లో మిత్రతో రంగేష్ మాట్లాడుతాడు. తాను చిన్నప్పటినుంచి ఏది అనుకున్నది చేయలేకపోయాను అని చెప్తాడు. జాబ్ చేయడం ఇష్టం లేదని ఇంట్లో చెబితే వద్దు అన్నారు. అలా తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక ఇళ్లు కొనమన్నారు. ఇప్పుడు బిజినెస్ చేయాలని ఆశ ఉన్నా చేతులో డబ్బులు లేవని బాధ పడుతూ చెప్తాడు. తాను ఆశించిన జీవితం ఎలాగు దొరకలేదు… కనీసం తన వైఫ్ అయినా తను ఆశించినట్లు ఉండమని టార్చెర్ పెట్టేవాడిని అని చెప్తాడు. తరువాత సీన్లో ఇదే విషయాన్న పవిత్రతో చెప్తుంది మిత్ర. నెక్ట్స్ సీన్లో అర్జున్ బుల్లెట్ బండి గురించి తన మ్యాగజిన్ ఒక ఆర్టికల్ రాస్తాడు. దాన్ని తగ్గించమని వాళ్ల బాస్ చెప్తాడు. ఆ విషయంలో బాస్ తో గొడువ పెట్టుకుంటాడు. మీరు తప్పును పట్టుకోవాలని ఫిక్స్ అయితే అన్ని తప్పులే దొరుకుతాయి. ప్రతి రోజు ఇలా తప్పులు వేలెత్తి చూపిస్తే ఎలా పనిచేసిది అని తన వైఫ్ అన్న మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతాడు అర్జున్. తన వైఫ్ తనకంటే స్మార్ట్ గా ఉందని, ఎక్కువ విషయాలు దివ్యకు తెలుసని అర్జున్ ఈగో హార్ట్ అవుతుంది. అలా తనను అధికమించడానికి ఇంట్లో చిన్న పనుల విషయంలో దివ్వ తింగరి అంటూ తను వెర్రిగా బిహేవ్ చేస్తున్న విషయం గుర్తుకువచ్చి వాష్‌రూంలోకి వెళ్లి ఏడుస్తాడు. అక్కడికి తన బాస్ వచ్చి ఏం జరిగింది అని అంటే తన వైఫ్ గురించి చెప్తాడు. ఆర్టికల్ విషయంలో నన్ను డామినేట్ చేస్తేనే ఊరుకోవడంలేదు, అలాంటిది దివ్యను నేను ఎన్నో సార్లు తప్పు పట్టాను అని ఏడుస్తాడు. తరువాత దివ్వతో మాట్లాడుతాను అనుకుంటాడు. అర్జున్ వచ్చాడు అని దివ్వ తల్లి చెబుతుంది. అర్జన్ మంచిగా మాట్లాడుదామని ఇంటికి వెళ్తే దివ్వ డైవర్స్ కావాలి అని అడుగుతుంది. దాంతో అర్జున్ కాసేపు ఆలోచించి సరే అని అక్కడినుంచి వెళ్లిపోతాడు. తరువాత దివ్వ కూడా బాధ పడుతూ కూర్చుంటుంది.
నెక్ట్స్ సీన్లో మిత్ర తన ఇంట్లో పేయింట్ మారస్తుంది. అదే సమయంలో మను ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. తన దగ్గరకు వెళ్లి నువ్వు ఎప్పటిలాగా మాట్లాడు అని అడుగుతుంది. నాకు పని ఉందంటాడు మను. లేదు ఇలా ఎన్ని రోజులు అని నాతో మాట్లాడవు, నీతో గొడువ పడుతాను, నీ ఫోన్ చూస్తాను, లేట్ గా వస్తే పోసెస్సీవ్ గా ఉంటాను అని చెబుతుంది. ఇలా మాట్లాడకు… అసలు మిత్ర ఎవరో అని కన్ఫ్యూజ్ గా ఉందని మను అంటాడు. నువ్వు చేసేటివి అన్ని నటించినట్లుగా ఉన్నాయి అని అంటాడు. మిత్ర ఏడుస్తుంది. నేను నాలానే ఉంటాను అని ఏడుస్తుంది. నువ్వు ఇలా చేయడం కూడా స్ట్రాటేజీ ఎమో అనిపిస్తుంది అని మను అంటాడు. మిత్ర ఏడుస్తుంది. మను వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో రంగేష్ హౌస్ ఈఎంఐ గురించి మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో పవిత్ర అక్కడి వచ్చి తన దగ్గర ఉన్న బంగారాన్ని తకట్టు పెట్టి ఈఎంఐ కట్టండి అలాగే మీకు నచ్చిన బిజినెస్ చేయండి.. బాబుకు సంవత్సరం నిండింది నేను జాబ్ చేస్తా అని అంటుంది. కట్ చేస్తే బ్యాంక్ లో లోన్ కోసం రంగేష్ కూర్చొని ఉంటాడు. అదే సమయంలో బ్యాంక్ మ్యానేజర్ పిలుస్తాడు. ఇది రిస్క్ అని చెప్తాడు మేనేజర్. అయినా సరే ఫుడ్ బిజినెస్ బాగుంటుందని రంగేష్ చెప్తాడు. ఫస్ట్ మ్యానేజర్ ఒప్పుకోడు తరువాత తనకు లోన్ ఇస్తున్నట్లు చెప్తాడు. రంగేష్ ఎమోషనల్ అవుతాడు. తరువాత ఇంటికి వెళ్తే పవిత్ర రెడీ అయి ఉంటుంది. ఎక్కడికి జిమ్ కా అంటే కాదు ఒండోర్ కాంపిటీషన్ కు అంటుంది. నేను రావోచ్చా అని తనతో పాటే కాంపిటీషన్ వెళ్లి తన వైఫ్ ను ఎంకరేజ్ చేస్తాడు. సాంగ్ మొదలౌతుంది. తనకు ధైర్యం చెబుతూ ప్రోత్సహిస్తాడు. కాంపేటీషన్ లో పవిత్ర గెలుస్తుంది. రంగేష్ ను హగ్ చేసుకుంటుంది. ఇద్దరు కలిసిపోతారు. అందరూ చప్పట్లు కొడుతారు.
తరువాత సీన్లో పవిత్ర మిత్రకు వారు కలిసిపోయిన ఫోటో మెస్సెజ్ చేస్తుంది. మిత్ర సంతోష పడుతుంది. అదే సమయంలో మను వచ్చి పేపర్ చదువుతాడు. తనను ఏం అనకుండానే ఆఫీస్ కు వెళ్తుంది. నెక్ట్స్ సీన్లో కోర్టులో అర్జున్ దివ్వ ఇద్దరు డివోర్స్ పేపర్ మీద సైన్ పెట్టడానికి వస్తారు. ముందు అర్జున్ ను సైన్ పెట్టమంటాడు లాయర్… తరువాత దివ్వ సైన్ పెడుతూ ఆగిపోతుంది. మిత్ర చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. రిలేషన్ షిప్ మిర్రర్ కాదు రబ్బర్ బ్యాండ్ అని, తెగిపోయిన ముడివేసి వాడుకోవచ్చు అని చెప్తుంది. దాంతో దివ్య పైకి లేచి.. నేను టవల్ ఆరవేయకపోతే నన్ను తిట్టవు కదా అని అర్జున్ ను అడుగుతుంది. దాంతో ఎమోషనల్ అయిన అర్జున్ దివ్యాను హగ్ చేసుకుంటుంది. ఈ సీన్ ను మిత్ర చూసి సంతోషపడుతుంది.
మను ఇంట్లో ఏదో వెతుకుతుంటాడు. అప్పుడు మిత్ర రాసి పక్కన పెట్టుకున్న కొన్ని కాగితాలు కనిపిస్తాయి. అందులో మను ఫోన్ చెక్ చేసినట్లు, లేట్ గా వస్తే కోపం తెచ్చుకున్నట్లు, తనతో మాట్లాడకపోతే తాను బాధపడ్డడ్డు ఇలా అన్ని రాసి ఆ బ్యాగ్ లో దాచుకుంటుంది. వాటిని అన్నింటిని చదువుతాడు మను. అవి చదువుతూ సంతోషపడుతాడు. ఇక ప్రస్తుతం చాలా మందిని చూస్తే భయమేస్తుందని రాస్తుంది. చిన్న విషయాలకే విడిపోతున్నారు. మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి అని తెలిసినా ఎవరు వినడం లేదు. అలాంటి పరిస్థితి మన మధ్య వస్తే నేను బరించలేను.. దూరంగా వెళ్లిపోతాను అని రాస్తుంది. నీతో మాట్లాడకుండా ఉండలేను అని రాస్తుంది. వాటన్నింటిని తీసుకొని మిత్ర దగ్గరకు వెళ్తాడు. అసలు మిత్ర ఈ బ్యాగ్ లో ఉందని చెప్తాడు. తరువాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఎమోషనల్ అవుతారు. మానవ బంధవ్యాలు నిజంగా అద్భుతాలు.. అందులో ఇష్టం, కష్టం, బాధ, సంతోషం, నవ్వులు, ఏడుపులు ఇలా ఎన్నో భావాలు ఉంటాయి. ఒకరిని విడిచిపెట్టడానికి వెయ్యి కారణాలు ఉండోచ్చు. కాని కలిసి ఉండడానికి ఒక్క బలమైన కారణం ఉన్నా చాలు వాళ్లను ఎన్నటికి విడవద్దు బలంగా పట్టుకోండి అనే వాయిస్ ఓవర్ తో సినిమాకు శుభం కార్డు పడుతుంది.