»Navya Nanda Makes Her Paris Fashion Week 2023 Modeling Debut At The Loreal Show In Red Ruffles
Paris Fashion Week షోలో బిగ్ బి మనుమరాలు కేక
అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ 2023లో భాగంగా పారిస్‌లో జరిగే లోరియల్ షోలో ఐశ్వర్యరాయ్‌తో పాటు అమితాబ్ బచ్చన్ మనువరాలు కూడా పాల్గొంది. ఎందరో బాలీవుడ్ తారాలు ఈ ర్యాంప్‌పై సత్తా చాటగా తాజాగా ఇదే జాబితాలో బిగ్ బి మనువరాలు చేరింది.
Navya Nanda Makes Her Paris Fashion Week 2023 Modeling Debut At The L'Oreal Show In Red Ruffles
Paris Fashion Week 2023: అంతర్జాతీయ ఫ్యాషన్ షో(Fashion Show)ల రన్‌వేపై బాలీవుడ్(Bollywood) సెలబ్రిటీలు ర్యాంప్ వాక్ చేయడం అది వారి గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఎన్నో సంవత్సరాలుగా ఈ గొప్ప ర్యాంప్‌పై ఎందరో తారాలు అరంగేట్రం చేశారు. తాజాగా ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్(Amithab bachchan) మనువరాలు నవ్య నవేలి నందా(Navya Nanda) చేరింది. స్టార్ కిడ్ పారిస్ ఫ్యాషన్ వీక్ 2023లో ఈఫిల్ టవర్ లైట్ల వద్ద జరిగే లోరియల్ షోలో నవ్య తన అద్భుతమైన వాకింగ్‌తో ఆకట్టుకుంది. ఫ్రెంచ్ బ్యూటీ బ్రాండ్ కోసం నవ్య ఆఫ్ షోల్డర్ నెక్లైన్ కలిగి ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడిచింది. లోరియల్ అంబాసిడర్లుగా ఉన్న కెండల్ జెన్నర్, ఎల్లే ఫానింగ్, ఎవా లాంగోరియా లాంటి వారి సమక్షంలో నవ్వ అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చింది. ఈ షోలో మోడల్స్ అందరూ క్రిమ్సన్ డ్రెస్ కోడ్‌లో ఒకే ర్యాంప్‌లో నడిచారు. నవ్వ ఫర్మార్మెన్స్ను ఆమె తల్లి అమితాబ్ బచ్చన్ కూతురు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన తొలి ర్యాంప్ వాక్‌ను చూడడానకి తన తల్లితో పాటు అమ్మమ్మా జయాబచ్చన్ కూడా వచ్చారు.
ఇంకో విశేషం ఏంటంటే ఇదే షోలో నవ్య అత్త ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) కూడా ర్యాంప్ వాక్ చేయడం తనకెంతో స్పెషల్ అని చెప్పారు. అయితే ఐశ్వర్య రాయ్ బచ్చన్ దశాబ్దాలుగా లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అలాగే కేన్స్, ప్యారిస్ ఫ్యాషన్ వీక్ వంటి వార్షిక అంతర్జాతీయ ఈవెంట్లకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే ర్యాంప్‌పై మెరిసే బంగారు రంగు అద్దాల డ్రెస్‌తో ఐశ్వర్య వాక్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే మనుషి చిల్లర్, బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తదితరులు ఈ ర్యాంప్ వాక్‌పై మెరిశారు. అలాగే తన ఫస్ట్ ర్యాంప్ వాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు నవ్య నవేలి నందాను పొగడ్తలతో ముంచేస్తున్నారు.