Aaradhya School Fee: సెలబ్రిటీల పిల్లలు ఏం చేసినా సంచలనమే.. వాళ్ల స్కూలింగ్, కాలేజీ.. చివరికీ యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటారు. సినిమాల్లోకి వచ్చే వరకు వార్తల్లో ఉంటారు. సెలబ్రిటీలు స్కూల్, ఫీజు కూడా చర్చకు వస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీ పిల్లల గురించి ఒక్కటే డిస్కషన్.. అందాల తార ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాద్య బచ్చన్ (Aaradhya) గురించే ఇప్పుడు చర్చ అంతా.. ఆమె స్కూల్, ఫీజు గురించి చర్చకు దారితీసింది.
ఆరాధ్య (Aaradhya) పేరంట్స్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ ఇద్దరూ స్టార్స్. రెండు చేతుల సంపాదిస్తున్నారు. తాతల సంపాదన కూడా ఉంది. ఇంకేం కావాలి.. స్కూల్, ఫీజు గురించి ఆలోచించరు. ముంబై అంటే స్కూల్స్ మాములుగా ఉండవు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు అంటే మాటలు కాదు. ఎల్కేజీ నుంచి ఫీజు లక్షల్లో తీసుకుంటారు. అక్కడ సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారుల పిల్లలు ఎడ్యుకేషన్ కొనసాగుతుంటుంది.
అంబానీ స్కూల్లో ఎల్కేజీకి రూ.5 లక్షల వరకు తీసుకుంటారని తెలిసింది. 8వ తరగతి నుంచి 10వ తగరతి, ఇంటర్మీడియట్ క్లాసులకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఫీజు తీసుకుంటారని సమాచారం. అంబానీ స్కూల్లో ఆరాధ్య ఆరో తరగతి చదువుతుంది. ఆమె చదువు కోసం ఏడాదికి రూ.20 లక్షలు ఫీజు చెల్లిస్తున్నారని తెలిసింది. ఇక్కడ మరికొందరు సెలబ్రిటీల పిల్లలు చదువుతున్నారు. షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రహం, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, చుంకీ పాండే పిల్లల చదువు ఇక్కడే కొనసాగుతోంది.
సెలబ్రిటీలు కాబట్టి వారు డబ్బును లెక్కచేయరు. మంచి స్కూల్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. తిరిగి తమ బిడ్డలు ఇండస్ట్రీకి వస్తారు కదా అనుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రూ.20 లక్షలు అంటే పెద్ద అమౌంట్. దాదాపు సగం జీవితంలో సంపాదించే మొత్తం అవుతుంది.