బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. వీరి పెళ్లి వీడియోలో సంప్రదాయానికి సంబంధించిన వేడుకులు ఏవి లేకుండా వీడియో ఉంది. అయితే వీడియోలో ఏముందో ఓసారి లుక్కేయండి మరి.
Parineeti Chopra pre wedding shoot video on cultural activities
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఇటివల వివాహం చేసుకున్నారు. అయితే ఆదివారం అట్టహాసంగా జరిగిన వీరి వివాహం కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇవి కాకుండా పరిణీతి ప్రీ వెడ్డింగ్ షూట్ కొన్ని సరదా ఫోటోలను షేర్ చేసింది. సాధారణంగా పెళ్లి అంటే చాలా సంప్రదాయాలు ఉంటాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా చాలా ఈవెంట్స్ ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈ ట్రెడిషన్స్ ని పక్కన పెట్టి, సరదాగా కొన్ని గేమ్స్ ఆడారు.
పరిణీతి , రాఘవ్ లు కస్టమైజ్ చేసిన టీ-షర్టులు ధరించి, మ్యూజికల్ చైర్ నుంచి క్రికెట్ వరకు పలు రకాల ఆటలు ఆడారు. పరిణీతి చోప్రా నారింజ రంగు టీ-షర్టుతో వధువు అని స్టైల్‌తో రాసి ఉంది, రాఘవ్ బ్లూ టీ-షర్ట్‌లో వరుడు అని రాసి ఉండటం విశేషం. ఇద్దరి కుటుంబాలతో పాటు, క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఫోటోల్లో కనిపించారు. దానిపై టీమ్ చద్దా అని వ్రాసిన తెల్లటి చొక్కా ధరించాడు. అసలు పెళ్లిలో ఇంత సరదాగా ఇలాంటి గేమ్స్ ఆడతారా అనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే, వారు సరదాగా ఎంజాయ్ చేసిన విధానం మాత్రం అందరికీ విపరీతంగా నచ్చుతోంది. ఫ్యాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా రాఘవ్-పరిణీతి వివాహం ఈనెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధు మిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఇక వీరి పెళ్లికి ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు రాగా..అందులో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.