»Aishwarya Rai Abhishek Bachchan Divorce Aishwarya And Abhisheks Divorce Became A Hot Topic
Aishwarya rai-Abhishek divorce: హాట్ టాపిక్‌గా మారిన బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విడాకులు
ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూడా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
aishwarya rai -abhishek bachchan divorce: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ప్రస్తుతం వీరి విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే విడాకుల వార్తలకు తగ్గట్టే ఐశ్వర్యరాయ్‌తో మామ అమితాబ్ బచ్చన్ ప్రవర్తిస్తున్నారు. కోడలు ఐశ్వర్యరాయ్‌ను అమితాబ్‌బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేశారు. దీంతో నెటిజన్లు విడాకులు నిజమే అని భావిస్తున్నారు.
బాలీవుడ్ క్యూట్ పెయిర్లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ 2007లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇండస్ట్రీలో చాలా జంటలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. తర్వాత విడిపోతున్నారు. విడిపోయే ముందు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకుంటున్నారు. మామ అయిన అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్‌ను అన్ ఫాలో చేశాడు. దీంతో ఈ విడాకుల టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.