TPT: నాగలాపురంలోని మత్స్యావతార మూర్తి శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం ఉదయం మత్స్య జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మత్స్య కార్మిక కుటుంబాల వారు కంకణం, ఇరుముడులు ధరించారు. వేదనారాయణ స్వామి ఆలయం నుంచి కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి వారు గ్రామోత్సవానికి బయలుదేరారు.