దర్శకుడు రాజమౌళి ‘ధురంధర్ 2’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘4 గంటల నిడివి గల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఆదిత్య ధర్ చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు’ అని కొనియాడాడు. రణ్వీర్ సింగ్ నటన, మేకింగ్‌పై రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.