PDPL: రామగుండం సింగరేణి సంస్థ బీ-గెస్ట్ హౌస్ సమీపంలోని మూలమలుపు వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు పనులు నాణ్యంగా నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.