NZB: సైబర్ నేరగాళ్లకు అక్రమంగా బ్యాంక్ ఖాతాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురిని పట్టుకోగా, వారి ఖాతాల ద్వారా మూడు నెలల్లో ₹31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నకిలీ పత్రాలతో ఖాతాలు తెరిచి నేరాలకు వాడుతున్నారని, ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.