ప్రభాస్ ప్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. సాలార్ పార్ట్ 1 విడుదల తేదీని ఈ మేరకు మేకర్స్ ఖరారు చేశారు. ఇక ట్విస్ట్ ఎంటంటే ఈ మూవీ రిలీజ్ అవుతున్న రోజు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ యాక్ట్ చేసిన డుంకీ మూవీ కూడా విడుదలవుతుంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్(prabhas) యాక్ట్ చేసిన రాధే శ్యామ్, ఆదిపురుష్ వరుస ప్లాపుల తర్వాత వస్తున్న చిత్రం సాలార్. అయితే ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో తప్పకుండా ఈ మూవీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాలేదని మేకర్స్ ఈ మూవీ రిలీజ్ తేదీని వాయిదా వేశారు. తాజాగా హోంబలే ఫిల్మ్స్, ప్రొడక్షన్ హౌస్ ఎట్టకేలకు ఈ సినిమా పార్ట్ 1 కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి త్వరలో మీ ముందుకు రాబోతున్నామని తెలిపింది. డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుసుకుందామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
BREAKING: Pan India Star 🦖#Prabhas‘ #Salaar CONFIRMED to hit the BIG screens WW on 22 December 2023.
అయితే ఇదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్(shah rukh khan) యాక్ట్ చేస్తున్న డుంకీ మూవీ కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కింగ్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, దియా మీర్జా, బోమన్ ఇరానీ, ధర్మేంద్ర సహా పలువురు నటీనటులు యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సి.కె.మురళీధరన్ అందించగా, సంగీతం ప్రీతమ్ సమకుర్చారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డుంకీ కూడా డిసెంబర్ 22న రిలీజ్ కావడంతో ప్రభాస్, షారుఖ్ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ముందుగా ప్రకటించిన డుంకీ విడుదల తేదీ వాయిదా వస్తారా? లేదా రెండు చిత్రాలను అదే రోజు విడుదల చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అంతేకాదు రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రిలీజ్ కానున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.