»Vishal Is The Hero Who Exposed The Bribe To The Central Censor Board
Hero Vishal: కేంద్ర సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చా..ఆధారాలతో బయటపెట్టిన హీరో విశాల్
కేంద్ర సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోని సినిమా కోసం తాను సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీకి ఆధారాలతో సహా విన్నవిస్తానని ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం విడుదలై మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా వెర్షన్ విడుదల కోసం తాను కేంద్ర సెన్సార్ బోర్డులోని కోందరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. వెండితెరపై అవినీతిని చూపించడం బాగానే ఉంటుంది కానీ నిజ జీవితంలో అవినీతి దారుణంగా ఉండటం జీర్ణించుకోలేమని, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తప్పుదారి అని విశాల్ నోట్ రాశారు.
హీరో విశాల్ షేర్ చేసిన వీడియో:
#Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l
ముఖ్యంగా ముంబయిలోని సీబీఎఫ్ సీ (కేంద్ర సెన్సార్ బోర్డు) ప్రధాన కార్యాలయంలోనే అవినీతి జరిగితే ఇంకేం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తాను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విడుదల చేసేందుకు రూ.6.5 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని, సెన్సార్ సర్టిఫికెట్‌కు రూ.3.5 లక్షలు, సినిమా ప్రదర్శించుకునేందుకు మరో రూ.3 లక్షలు చెల్లించినట్లుగా విశాల్ తెలిపారు. రెండు ట్రాన్సాక్షన్లలో చెల్లించానని, తన కెరీర్ లో అటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, సినిమా రిలీజ్ కాకపోతే నష్టపోతామన్న తప్పనిసరి పరిస్థితుల్లో, మరో మార్గం లేక, మేనకా అనే మధ్యవర్తి ద్వారా డబ్బు చెల్లించినట్లు తెలిపారు.
కేంద్ర సెన్సార్ బోర్డులో జరుగుతోన్న వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తాను చేసే ఆ పని భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూస్తానన్నారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును అవినీతిపరులపాలు చేయనని, పక్కా ఆధారాల కోసమే అలా చేశానని అన్నారు. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుందని విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా హీరో విశాల్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.