NDL: ప్యాపిలి(మం) గోపాల్ నగరంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన వెంకటకృష్ణ (32) అనే వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.