Ayodhya Prana Pratishtha To Be Held On January 22nd
Ayodhya Prana Pratishtha: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట (Ayodhya Prana Pratishtha) తేదీ ఖరారు అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవుతారని తెలిసింది. జనవరి 20 నుంచి 24వ తేదీ మధ్యలో ప్రాణ ప్రతిష్ట ఉంటుందని.. మోడీ పాల్గొంటారని ఆలయ నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
అయోధ్యలో మూడు అంతస్తుల్లో రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. డిసెంబర్ లోపు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి కానుంది. జనవరి 14వ తేదీ నుంచి ప్రార్థనలు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. సీతా రాముల విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత రోజు నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. ఆ రాముడి విగ్రహం ముందే ప్రస్తుత భగవంతుడి విగ్రహాం ఉంచుతాం అని తెలిపారు.
ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా ఫిబ్రవరిలో అయోధ్య పర్యటన పెట్టుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. మోడీ టూర్ దృష్ట్యా భద్రత ఏర్పాట్లు చేస్తారు. భక్తుల రాకపై ఆంక్షలు ఉంటాయి. జనవరి 14వ తేదీ సంక్రాంతి తర్వాతి నుంచి 10 రోజుల రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించాలని టెంపుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.