E.G: గోపాలపురంలో ఉన్న సివిల్ సప్లై గోదాంపై విజిలెన్స్ DSP తాతారావు తన సిబ్బందితో ఆకస్మిక దాడి నిర్వహించారు. రేషన్ బియ్యం, ప్రభుత్వం సరఫరా చేసే నూనె, పంచదార నిల్వలపై సమగ్రంగా పరిశీలించారు. సరుకుల నిల్వలు, రికార్డులు, పంపిణీ విధానం తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఈ తనిఖీలలో డివిజనల్ సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ రంగ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.