హైదరాబాద్ మహానగరంలో దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభం కానుంది. కేపీహెచ్బీలో లులు గ్రూప్ ఈ మాల్‌ను నిర్మించింది. నగర వాసులకు ఇదొక షాపింగ్ స్పాట్‌గా నిలువనుంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. తెలంగాణలో ఇదే అతి పెద్ద మాల్ కావడం విశేషం. కూకట్‌పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ లులు మాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుంది. బుధవారం రాత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆ మాల్ ప్రారంభం కానుంది.
లులు ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రపంచంలో 22 దేశాల్లో 250 బ్రాంచీలను నిర్మించింది. భారత్‌లో ఇప్పటికే ఐదు మాల్స్ ఉండగా కూకట్‌పల్లిలో ఓపెన్ చేసేది 6వది కావడం విశేషం. ఇదే కాకుండా రాష్ట్రంలో రూ.3500 కోట్ల పెట్టుబడులను లులు సంస్థ పెట్టనుంది. ఈ లులు మాల్లో హైపర్ మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సూపర్ మార్కెట్లు, బిగ్ మార్కెట్ల తరహాలో ఇక్కడ ఫుడ్ మెటీరియల్, గ్రోసరీ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అవసరమయ్యే అన్ని వస్తువులు ఒకేచోట లభించనున్నాయి. ఏ టూ జెడ్ ఈ మాల్లోని సూపర్ హై మార్కెట్లో లభించనుంది.
వరల్డ్ క్లాస్ షాపింగ్ మాల్ పేరుతో లులు అతిపెద్ద కాంప్లెక్స్‌ను ఇందులో ఏర్పాటు చేసింది. రిలాక్సింగ్ స్పా, ఫుడ్ కోర్ట్స్, కాంప్లెక్స్ తోపాటు 1400 మంది కూర్చునే విధంగా ఐదు స్క్రీన్లతో సినీ పాలీస్లను ఈ మాల్లో ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఈ మాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.