»Shocking Salar Re Shoot Pressure On Prashant Neil
Salaar: షాకింగ్.. ‘సలార్’ రీ షూట్, ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి!
అసలు సలార్ రిలీజ్ ఎప్పుడు? ఈ ఏడాదిలో ఉంటుందా? అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతుపట్టకుండా పోయింది. కానీ 'సలార్' ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒత్తిడికి గురవుతున్నాడట. రీ షూట్ కూడా చేస్తున్నాడట!
సలార్ రిలీజ్ డేట్ పై అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే నాడు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ లోపు బయటికొస్తున్న అప్డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పై హీరోయిన్ శృతి హాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలోను శృతి హాసన్ ‘సలార్’ పై ఇచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సలార్ మూవీ లార్జర్ దేన్ లైఫ్ అని, ప్రభాస్ ఓ వండర్ ఫుల్, హంబుల్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కు ఏ మాత్రం తగ్గకుండా సలార్ ఉంటుందని చెప్పొచ్చు.
కానీ లేటెస్ట్ న్యూస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చేలా ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురుచూస్తున్నారు అభిమానులు. దీంతో ప్రశాంత్ నీల్ ఒత్తిడికి గురవుతున్నాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని భావిస్తున్నాడట. విఎఫ్ఎక్స్తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో సంతృప్తిగా లేడట ప్రశాంత్ నీల్. అందుకే ప్యాచ్ వర్క్‌కు చేస్తున్నాడట. అంతేకాదు ప్రభాస్ లేని ఒక కీలక ఎపిసోడ్‌ని సైతం మళ్ళీ షూట్ చేశాడని తెలుస్తోంది. దీంతో అసలు సలార్ తెర వెనక ఏం జరుగుతుందనేది అర్థం కాకుండా పోయింది. అందుకే.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే ఏడాది మార్చిలో సలార్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ప్రభాస్‌కు ప్రశాంత్ నీల్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.