Ileana shared her son's photo. Netizens are asking where her husband is
Ileana: గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్(Ileana D’Cruz) లవ్ బ్రేకప్, డిప్రెషన్ తరువాత ఇన్నాళ్లకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఒత్తిళ్ల నుంచి బయటపడి మే నెలలో ప్రియుడు మైఖేల్ డోలన్‌ను పెళ్లిచేసుకుంది. ఆగస్టు 1న వీరికి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) జన్మించాడు. గతంలో ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం, బ్రేకప్ తరువాత తన పెళ్లికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతోందని బీటౌన్ చర్చించుకుంటొంది. అయితే తన కుమారుడి ఫోటోలను మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
పెళ్లి విషయం తప్ప అన్ని విషయాలను పంచుకుంటుంది. తల్లికాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌తో తెలుగు, హిందీ పరిశ్రమలు ఒక్కసారిగా పరేశాన్ అయ్యాయి. ఇక అప్పటి నుంచే నెటిజన్లు తన భర్త గురించి ఆరా తీశారు. ఆ తరువాత వరుసగా పోస్ట్‌లు పెడుతూ బేబీ బంప్ పిక్స్‌ను కూడా షేర్ చేసింది. తన హబ్బీ ఫోటలను రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు మీడియా కథనాల ప్రకారం మైఖేల్ డోలన్‌ను రహస్యంగా వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఇలియానా ఒక నెల వయసున్న కొడుకు కోవా ఫీనిక్స్ డోలనన్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తనయుడి కాళ్లను కప్పి ఉంచింది. ఈ ఫోటో చూసిన వారు కొడుకు ఫోటోలను చూపిస్తోంది కానీ భర్తనే దాస్తోంది అంటున్నారు. ర్యాప్ సింగర్ బాద్షాతో కలిసి ఇలియానా సబ్ గజాబ్ అనే మ్యూజిక్ వీడియోలో చివరగా కనిపించింది. ప్రస్తుతం అన్‌ఫెయిర్ & లవ్లీ – లవర్స్ చిత్రాలలో నటిస్తోంది.