Ileana: గోవా బ్యూటీ ఇలియానా (Ileana) బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబు తండ్రి ఎవరో ఇప్పటివరకు చెప్పలేదు. దీంతో అందరికీ సందేహాలు వచ్చాయి. ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ ఫోటో రివీల్ చేసింది. సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఏడాది క్రితం తను గర్భవతిని అయ్యానని.. ఆ క్షణాలు భావోద్వేగంతో కూడినవని వివరించారు. డెలివరీ అయిన తర్వాత బేబీ కోవా ఫీనిక్స్ డోలన్ను ఎత్తుకున్న సమయంలో ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనని అంటోంది.
ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు తన వద్ద అమ్మ ఉందన్నారు ఇలియానా (Ileana). ఆ క్షణాలు అపురూపమైనవని పేర్కొన్నారు. తాను సింగిల్ పేరంట్ కాదని.. తన పార్ట్నర్ని పరిచయం చేసింది. కుమారుడు, పార్ట్ నర్ తన జీవితం అంటున్నారు. ప్రస్తుతం బాబుతో టైమ్ స్పెండ్ చేస్తున్నానని ఇలియానా (Ileana) వివరించారు. పెద్దవాడు అయ్యాక మూవీస్ చేస్తానని చెప్పింది. ఇల్లు బేబీ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్లో కొన్ని మూవీస్ చేసింది. ఆ తర్వాత మెల్లిగా సినిమాలకు దూరంగా ఉంది. కానీ తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఇస్తూనే ఉంది.