»Shock For Chandrababu Remand Extended For Another 11 Days
Breaking: చంద్రబాబుకు షాక్..మరో 11 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు
చంద్రబాబుకు మరో 11 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. సోమవారం బెయిల్పై విచారణ ఉంటుందని జడ్జి తెలిపింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు 11 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రిమాండ్లో ఉండనున్నారు. నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సీఐడీ కస్టడీ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరిచారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ రెండురోజుల పాటు తమ కస్టడీలో విచారించింది. 12 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. విచారణంలో 120 ప్రశ్నలు అడిగింది. మొదటి రోజు ఏడు గంటల పాటు సీఐడీ 50 ప్రశ్నలను అడిగింది. రెండో రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగింది. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా చంద్రబాబును విచారించారు.
సోమవారం చంద్రబాబు బెయిల్పై విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసింది. వరుస పిటీషన్లపై కోర్టు సమయం వృథా అవుతోందని కోర్టు తెలిపింది. అక్టోబర్ 5వ తేది వరకూ చంద్రబాబు రిమాండ్లో ఉండాలని వెల్లడించింది.