Chandrababu:స్కిల్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబుపై (Chandrababu) సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నలు సంధించారు. స్కిల్ స్కామ్ గురించి 120 ప్రశ్నలను సిద్ధం చేసుకోగా.. ఈ రోజు 50 ప్రశ్నలు వేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. సమాధానాలను రికార్డ్ చేశారు. వాటిని కోర్టుకు సీల్డ్ కవర్లో అందజేస్తారు. విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబు విచారణ జరిగింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ప్రశ్నించారు. ఒక్కో టీమ్‌లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉన్నారు. విచారణ సమయంలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చారు. అలాగే విచారణకు ముందు, విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.