Nayanthara: ఒక్క పోస్ట్ తో రూమర్స్‌కి చెక్ పెట్టిన లేడీ సూపర్ స్టార్
జవాన్ హిందీ పార్ట్‌లో దీపికకు అట్లీ ప్రయారిటీ ఇచ్చారని.. నయన్ అలిగారనే వార్త చక్కర్లు కొట్టింది. ఈ రోజు అట్లీ బర్త్ డే సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విష్ చేసి.. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది.
Nayanthara: తమిళ సంచలన దర్శకుడు అట్లీ కుమార్ గురువారం తన 37వ పుట్టినరోజు జరుపుకున్నారు. షారుఖ్ ఖాన్ జవాన్ ద్వారా కెరీర్లో భారీ హిట్ సాధించాడు. ఈ ఏడాది బర్త్ డే అతనికి చాలా ప్రత్యేకమైంది. పుట్టినరోజు సందర్భంగా ఒక పుకారు ట్రెండ్ అయ్యింది. ఈ మూవీ విషయంలో హీరోయిన్ నయనతార చాలా అప్ సెట్ అయ్యింది అనేది ఆ వార్త సారాంశం. తన పాత్రను చాలా పార్ట్ వరకు కట్ చేశాడని, ఆమెకు కాకుండా దీపికా పదుకొణె కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో బాగా హర్ట్ అయ్యిందని రూమర్స్ వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని, నయనతార ఒక్క పోస్ట్ తో నిరూపించింది.
నయనతార ఇన్స్టాగ్రామ్ పేజీలో అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ విష్ చేశారు. నయనతార జవాన్ షూటింగ్ స్పాట్ నుంచి అట్లీతో కలిసి ఉన్న చిత్రాలను పంచుకుంది. అతనికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, అతని గురించి గర్వపడుతున్నట్లు పేర్కొంది. ఆమె విషెస్ చెప్పడంతో ఈ పుకార్లకు పులిస్టాప్ పడింది.