జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా నేడు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు తెలిపారు.