దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలను ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా చూపారంటూ ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా అటు హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డులు సైతం దక్కాయి. ఆస్కార్ తర్వాత అత్యున్నత అవార్డుగా గుర్తింపు పొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది.
తాజాగా రాజమౌళి తన తదుపరి సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని, అసలు ఆర్ఆర్ఆర్ సినిమాకంటే ముందుగానే మహేష్ సినిమా గురించి చర్చలు జరిగినట్లు తెలిపారు. మహేష్ బాబుతో తీసే సినిమా పదేళ్ల కిందటే ఫిక్స్ అయ్యిందని, అయితే కథను మెరుగులు దిద్దే పనిలో చాలా ఆలస్యం అవుతూ వస్తోందని తెలిపారు. హాలవుడ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలోనే గ్లోబల్ అడ్వెంచర్ గా తీయనున్నట్లు రాజమౌళి తెలిపారు.