PLD: మాచర్ల పురపాలక పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ యంత్రాంగం భారీ ఊరటనిచ్చింది. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిలను ఒకే మొత్తంగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని చెప్పారు.