»Ap Assembly Sessions 2023 Ambati Rambabu Counter To Balakrishna
AP Assembly sessions 2023:లో మీసం తిప్పిన బాలకృష్ణ..రా అంటూ అంబటి సవాల్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలు కావడంతోనే గందరగోళానికి దారితీశాయి. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చ కోసం వాయిదా తీర్మానం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మరోవైపు బాలకృష్ణ మీసం తిప్పడంపై వైసీపీ నేత అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ap assembly sessions 2023 ambati rambabu counter counter to balakrishna
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అక్రమాలు, దౌర్జన్యాలను బట్టబయలు చేసేందుకు సీఎం జగన్ నేతృత్వంలోని అధికార వైఎస్సార్సీ(YSRCP) సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సెషన్ మొదటి రోజు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టి ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం కోరింది. బాబు అరెస్టుపై చర్చ జరగాల్సిందేనని టీడీపీ సభ్యుల డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో తాము చర్చకు సిద్ధమని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులు(tdp members) చర్చించకుండా ఇలా ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ప్రతి అంశంపై కులంకషంగా చర్చిద్దామని వెల్లడించారు. అలా చేయకుండా ఇలా నిరసన తెలపడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు ప్రతి సెషన్లో ఇలాగే నిరసన చేస్తున్నారని గుర్తు చేశారు.
మరోవైపు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ(balakrishna) మీసం తిప్పడంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) రియాక్ట్ అయ్యారు. సినిమాల్లో అంలాటివి చేయాలని, ఇక్కడ కాదని అంబటి హితవు పలికారు. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. అంతేకాదు టీడీపీ సభ్యులు సక్రమంగా వ్యవహరించకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. సీనియర్ సభ్యులు కూడా పేపర్లు చింపడం ఏంటని అన్నారు. టీడీపీ సభ్యులు చేసే చర్యలు వైసీపీ సభ్యులు రెచ్చిపోయే విధంగా ఉన్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది.