ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఓ విద్యార్థి వైసీపీని, ఏపీ సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను వర్మ షేర్ చేశారు. చదువుకునే చిన్న పిల్లల నోటి నుంచి ఇలాంటి మాటలు ఏమిటని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్మ షేర్ చేసిన వీడియో:
This is the pits TDP stooped to ..Making a child talk in such COARSE language …I don’t know what organisations will take notice of this and whether it will come under HARMING CHILDREN’S MINDS ..This is how terrorists BRAIN WASH young children https://t.co/wiLrtvIXT1
ఆ వీడియో చూస్తుంటే టీడీపీ పద్ధతిలా ఉందని, చిన్నపిల్లవాడితో ఇలాంటి దారుణమైన భాష మాట్లాడిస్తున్నారని వర్మ ఫైర్ అయ్యారు. ఇలా మాట్లాడితే ఏ సంస్థలు ఇందుకు సంబంధించి చర్యలు చేపడతాయో కానీ, ఇలాంటి తీరు మాత్రం చిన్నపిల్లల మైండ్‌ను కలుషితం చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల మెదడును టెర్రరిస్ట్‌లా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారో ఆ వీడియోనే తెలుపుతుందని వర్మ కామెంట్ చేశారు. వర్మ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.